Home అంతర్జాతీయ వార్తలు సెక్యులర్ దేశాల్లోనే సంపద వృద్ధి!

సెక్యులర్ దేశాల్లోనే సంపద వృద్ధి!

Development

మత సంప్రదాయాలకు కట్టుబడి ఉండే దేశాల కన్నా లౌకిక భావాలు ఆదర్శంగా ఆచరించే సెక్యులర్ దేశాల్లోనే సంపద వృద్ధి ఎక్కువగా చెందుతుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. నైతిక విలువలు, మానవతా విలువలు పరస్పర ఇవన్నీ దేశాల పురోగతికి దోహదం చేస్తాయన్నది ఈ అధ్యయన సారాంశం అల్బేనియా నుంచి జింబాబ్వే వరకూ వివిధ దేశాల ప్రజల మానవతా విలువలు, లౌకిక భావాలు, ఆయా దేశాల స్థూలజాతీయోత్పత్తి(జిడిపి) మధ్య గల సంబంధాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించా రు.

20వ శతాబ్దంలో ఆర్ధిక ప్రగతికి దోహదం చేసే మత రాహిత్య వైఖరి ప్రాధాన్యం వహించడం, ఆర్ధిక ప్రగతిపై సెక్యులరైజేషన్ అంటే లౌకిత వ్యవస్థ ప్రభావం ఎంత వరకూ అన్న ప్రశ్నలకు ఈ అధ్యయనం కొంతవరకు సమాధానం ఇవ్వగలిగిందని పరిశోధనకులు భావిస్తున్నా రు. ఇదివరకటి సామాజిక వాదులు ఈ అంశంపై రెండు వైపులా వాదనలు వినిపించేవారు. సమాజిక నైతిక నియామాలపై అసమ్మతి ప్రభావం పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపుదల చేస్తుందని కొందరు వాదించగా, సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి ఆధారంగా మత సంబంధమైన అనేక ఆచరణలను సమాజం తప్పనిసరిగా వదుకోవలసి వస్తుందని మరికొందరు వాదించారు.

మత సంబంధం వ్యవస్థ కు, సంపద పురోగతికి గత కొన్ని దశాబ్ధాలుగా ఉన్న సంబంధం తెలిసిందే. ఈ నేపథ్యంలో మతపర సంప్రదాయాలకే పేద దేశాలు ఎక్కువగా కట్టుబడి ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ అధ్యయనం దైవత్వభావ రాహిత్యానికి, సంపన్నతకు గల మామూలు సం బంధాన్ని నిర్వచించ దలచుకోలేదు. అలాగే సంపద ఒక్క టే సెక్యులర్ వ్యవస్థకు కారణమని అనుకోవడం లేదు. అయితే సెక్యులర్ విధానం ఎలాగైనా అంతిమంగా ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని తమ అధ్యనంలో వెల్లడయిందని బ్రిస్టల్ యూనివర్శిటీకి చెందిన డామియన్ రక్ పేర్కొన్నారు. మానవ వ్యక్తిగత హక్కులపై గౌరవం, సహనం ఉన్నప్పుడు దాంతో పాటు రూపొందే సెక్యులర్ విధానం ఒక్కటే ఆర్థిక పురోగతికి దారి చూపిస్తుందని బ్రిస్టల్ చెప్పారు. వీరి అధ్యయనం ‘సైన్స్ అడ్వాన్స్’లో వెలువడింది. ఐరోపా దేశాల మానవతా విలువలు, ప్రపం చ దేశాల నైతిక విలువలపై జరిగిన సర్వేల ఆధారంగా వీరు సమాచారం సేకరించి అధ్యయనంచేశారు. 1980 నుంచి ఈ సమాచార క్రోడికరణ జరిగింది. కుటుంబాల మధ్య పెనవేసుకున్న అనుబంధాలు,ఆత్మీయతా విలువల నుంచి స్వతింగ సంపర్కాల వరకూ వివిధ అంశాలపై ప్రశ్నలు గుప్పించి అభిప్రాయాలను రాబట్టగలిగారు.

1990 కన్నా ముందటి తరం వారి మానవతా విలువలు, సంబంధాలు, వారి కాలంనాటి సామాజిక పరిస్థితులను ఈ అధ్యయనంలో తెలుపనున్నగలిగారు. 20వ శతాబ్దంలో ప్రపంచ మొత్తం మీద మతపరమైన సంబంధాలు, ఆచరణల్లో, ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందని, దీనితో పాటు స్థూల జాతీయోత్పత్తిలో మార్పు కనిపించిందని అధ్యయన రచనలో సహకరించిన టెన్నిన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ అలెక్స్ ట్లెంట్లీ చెప్పారు. సెక్యులర్ విధానమే ఆర్థిక ప్రగతికి కారణం అని రూఢి చేసేందుకు ఈ రెండు అంశాల మార్పులు వివిధ కాలాల్లో ఏర్పడ్డానికి మూడో అంశం కూడా కారణమవుతోంది. సెక్యులర్ విదానం ఒక్కటే అని కాకుండా సమాజంలోని పౌరుల వ్యక్తిగత హక్కులపై ఆదరణ, సహనం పాటిస్తేనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతోందని అధ్యయనంలో నిర్ధారణకు వచ్చారు. సమాజ పురోగతి సఫలం కావాడానికి అంతిమంగా సహన మార్గమే చోధకశక్తిగా పనిచేస్తుందని అధ్యయనం వెల్లడించింది.
మన తెలంగాణ/ ప్రత్యేక విభాగం