Tuesday, April 23, 2024

ఆ జిల్లాలకు భారీ వర్షాలు… వాతావరణ శాఖ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Weather Report in Telugu

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాలోతో పాటు అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది.

ఈ వర్షాల వల్ల వరద ఉదృతి మరింత పెరిగనుందని, అన్ని చెరువులు, నదులు, వాగులు, వంకల్లో వరద నీరు  చేరడంతో పాటు భారీ వర్షం కురస్తే భయంకరమైన వరదలు సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండటం మంచిదని, మీకు కావాల్సిన సరుకులు, ముఖ్యమైన పనులు ఉంటే ఈ నవంబర్ 26 లోపు పూర్తి చేసుకోవాలని వాతావరణ అధికారులు తెలిపారు. వరద నుంచి ఉపశమనం ఉండదని, చిన్న వర్షానికే వరద వచ్చే అవకాశాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

తమిళనాడు కంటే మన రాష్ట్రంలోని దక్షిణ భాగాల పైన తీవ్రమైన ప్రభావం ఉంటుందని, మిగిలిన జిల్లాలు – కర్నూలు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ మూడు రోజులు మీరు చేయాల్సిన పనులు –

1) మీ చుట్టూ ఉండే అధికారుల నంబర్లు, వారు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలుసుకోండి.
2) వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పడవ అందుబాటులో ఉంచుకోవడం మంచిది.
3) పది రోజుల వరకు సరిపడ్డ సరుకులను తీసుకోవడం ఉత్తమం. మనకు తెలియదు, ఎలా ఉండబోతుందో ఈ వరద సమయంలో.
4) మీకు దూరపు ప్రాంతంలో ఉండే బంధువులకు, స్నేహితులకు ఈ విషయం గురించి తెలియజేయండి.
5) ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం, వరద సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి.

పెన్నా నది ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దానికి తోడు చెరువులు, కుంటు నిండి ఉండడంతో చిన్న వర్షం పడినా చాలు నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.  వర్షాలు భాగా తీవ్రంగా ఉన్నందువల్ల పెన్నా నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉంది.  చిత్రావతి, పాపాగ్ని నదుల పైన ఏకంగా 130 మిల్లీమీటర్ల అతిభారీ వర్షం పడటం వల్ల ఈ నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ముఖ్యంగా కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఏకంగా 185 మిల్లీమీటర్ల వర్షాన్ని నమోదైంది. గోదావరి-కృష్ణా నదిలాగా ఈ నది ప్రతి సంవత్సరం పొంగదు. ఉన్నట్టుండి ఒక్క రాత్రికి రాత్రే వరద వచ్చే నది పెన్నా నది. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మారుతున్న వాతావరణ పరిస్తుతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వుంటే ఏ ప్రమాదం పొంచి ఉన్న మనం బయటపడవచ్చు. చివరి మాట​, వరద అనేది ఒకే సంవత్సరంలో రెండు మూడు సార్లు కూడా వస్తాయి. ఒక్కసారి వరద వచ్చింది కదా, ఇక రాదేమో అనుకుంటే కష్టమే. అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. పెన్నా నదిలాగానే ఉత్తరాంధ్రలో నాగావళి, వంశధార నదులు ఉన్నాయి. అవి కూడా అలాంటివే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News