Home వరంగల్ రూరల్ చేనేత కార్మికులను ఆదుకోవాలి

చేనేత కార్మికులను ఆదుకోవాలి

 Weave handloom workers

మనతెలంగాణ/కాశిబుగ్గ : తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవాలని నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని కొత్తవాడలోని పద్మశాలి భవనంలో చేనేత కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని కొత్తవాడలోని చేనేత కార్మికులకు సరియైన పనిలేక నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా వారు పేర్కొనారు. అలాగే మూడు నెలల నుంచి మగ్గాలు సరిగా నడవడం లేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నా 30 కిలోల నూలు కాకుండా 100 కిలోల నూలు ఇవ్వాల్సిందిగా చేనేత కార్మికులు కోరుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సబ్సిడీ పై 100కిలల నూలు ఇవ్వాల్సిందని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చా విద్యాసాగర్, మంద వినోద్‌కుమార్, శ్రీనివాస్, రాజేశ్, రవీందర్, సుధాకర్, వెంకటయ్య, రమేష్, రజితతో పాటు వంద మంది చేనేత కార్మికులు తదితరులు ఉన్నారు.