Home తాజా వార్తలు రేపటి నుంచి పిజి మెడికల్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు

రేపటి నుంచి పిజి మెడికల్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు

Web options begin to replacement of pg convener quota seats

 

మొదటి విడత ప్రవేశాలకు
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కన్వీనర్ కోటా పిజి మెడికల్ సీట్ల భర్తీకి మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25 నుండి 27 తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు కాళోజి హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చెసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు, నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ వర్గాలు సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Web options will be begin to replacement of pg convener quota seats