Friday, September 20, 2024

వార ఫలాలు (01-09-2024 నుండి 07-09-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది . ఉద్యోగ విషయాలలో అభివృద్ధి ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చిన్న చిన్న ఒడుదొడుకులు ఉంటాయి. ఎన్ని వున్నా మీ మనో ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. ధనం విషయంలో అలోచించి ఖర్చు చేయాలి.   ఆత్మీయులతో విభేదాలు వచ్చే సూచన వుంది.ఆరోగ్య విషయం లో జాగర్తలు తీసుకోవాలి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది ముఖ్యంగా  స్త్రీలు ఈవారం జాగర్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా వున్నా ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కాలభైరవ రూపు ధరించండి, నిత్యం కాలభైరవ అష్టకం పఠించండి లేదా వినడం వలన మంచి ఫలితాలుంటాయి.

వృషభం: , ఏ పని చేసిన రెండు సార్లు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానీ వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన విషయంలో జాతక పరిశీలన చేసుకుని వెళ్లడం మంచిది. జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశం వుంది. మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తే విభేదాలు తొలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. పిల్లల చదువులు వారి ఉన్నత అభివృద్ధి మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. మన్యు పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలుంటాయి. విద్యార్థిని విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఒక దారి దొరుకుతుంది. వ్యాపారంలో లాభాల బాగుంటాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్న అధికారులు మీ శ్రమను, సామర్ద్యాన్ని గుర్తిస్తారు. మీ మేధా శక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యాలయాలు ప్రారంభిస్తారు. సహోదరి సహోదర వర్గంతో విభేదాలకు తావు లేకుండా ప్రవర్తించండి. పెళ్లి విషయమై కొన్ని ఒప్పందాలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ రాశి వారు భృగు పాశుపత హోమం, శక్తి రూపు ధరించండి మంచి ఫలితాలుంటాయి. ప్రతి నిత్యం అంగారక స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది. ప్రతి రోజు వీలైతే 11 సార్లు రాహు స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. విదేశీ ప్రాజెక్ట్ లభించే అవకాశం వుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డుకాలం అని చెప్పవచ్చు.  సరే వచ్చిన లాభాలకు అమ్మాలని యోచిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్‌కు, ట్రాన్స్‌ఫర్స్‌కు అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో జాగర్తలు తీసుకోవాలి, ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు.  సంతానం గురించి ఒక దిగులు, ఆందోళన ఉంటుంది. మనస్సును స్థిమితంగా ఉంచండి. జీవిత భాగస్వామితో స్వల్ప మనస్పర్థలు వచ్చే అవకాశం వుంది. సెల్ఫ్‌డైవింగ్‌ విషయంలో జాగ్రత్తలను పాటించండి. వివాహాది శుభకార్యాల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి రెండింటికి అవకాశాలు కలసి వస్తాయి.  ఈ రాశి వారు అఘోర పాశుపత హోమం, సౌర కంకణం ధరించండి మంచి ఫలితాలుంటాయి.ప్రతి నిత్యం శని స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి తో విబేధాలు వచ్చే అవకాశం వుంది. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సాధించగలుగుతారు.  సహోద్యోగులు, అధికారుల వలన అనుకోని గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ పరంగా అన్ని బాగున్నా ఎదో తెలియని డిప్ప్రెషన్ కు గురవుతారు. వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. నూతన వ్యాపార ప్రయత్నాలను కొద్ది కాలం పాటు వాయిదా వేయటం మంచిది. సంతాన విద్యా విషయములో కొంత మానసిక ఆందోళన ఉంటుంది. పెద్దలను ఎదిరించి మాట్లాడం మీకు ఎంతో భాద కలిగించే అంశమంగా చెప్పవచ్చు.  ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు.  ప్రయాణం విషయంలో జాగర్తలు తీసుకోండి. ఈ రాశి వారు సుబ్రమణ్య  పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలుంటాయి. సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించండి. ప్రతి రోజు వీలైతే సుబ్రమణ్య అష్టకం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం వారికి  మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి విషయాలలో కొంత ఓర్పును పాటించుట చాలా అవసరం. విధుల నిర్వహణలో గానీ, వ్యాపారాలలో గానీ, మార్పులు జరుగవచ్చును. ఉద్యోగపరంగా ప్రమోషన్‌  లభిస్తుంది. మీ నైపుణ్యానికి మంచి అవకాశము లభిస్తుంది. వ్యాపారాలలో మీ తెలివితేటలు బాగా ఉపకరిస్తాయి. ఆర్థిక విషయాలలో మీ నైపుణ్యం కనబరుస్తారు. భాగస్వామి వ్యాపారాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కాలం అనుకూలంగా వుంది. పొదుపు విషయంలో మీ అంచనాలు లాభాలు తెచ్చిపెడతాయి. విదేశాలలోఉద్యోగం  కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. విలువైన ఆస్తులు కొనుగోళ్లు చేస్తారు. నర దిష్టి అధికంగా వుంది. జీవిత భాగస్వామి తో మాట్లాడేటప్పుడు జాగర్తలు తీసుకోవాలి, అపోహలకు తావివ్వకండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విష్ణు ఆలయ దర్శనం మేలు చేకూరుతుంది.విద్యార్థిని విద్యార్థులకు మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. ఈ రాశి వారు సుబ్రమణ్య  పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలుంటాయి. సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించండి. ప్రతి రోజు వీలైతే సుబ్రమణ్య అష్టకం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి.

తుల: తులా రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలను పాటించండి. గ్రహగతులు రీత్యా, ఉద్యోగములలో స్థాన మార్పిడి, ప్రమోషన్‌లను సూచిస్తున్నాయి. పని వత్తిడి ఎక్కువగా వుంటుంది. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది.  ఆర్థికంగా ఈ వారం లాభిస్తుంది. పాత ఋణాలు తీర్చివేస్తారు. కష్టానికి తగిన ఫలితము వస్తుంది. సంతాన విద్యా విషయాలలో మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. విదేశీయానం, గ్రీన్‌కార్డు, వివాహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి.నరదృష్టి అధికంగా వుంది,  అపనిందలు, చెడు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. ఈ విషయంలో  తగిన జాగ్రత్త వహించండి.  ఆరోగ్య పరంగా బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా వుంది.  ఈ రాశి వారు మేధా దక్షిణామూర్తి హోమం చేయించండి మంచి ఫలితాలుంటాయి. మేధా దక్షిణామూర్తి  రూపు ధరించండి. ప్రతి రోజు వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలుంటాయి.

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం  ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో, వృత్తిలో మీరు చూపించే నైపుణ్యానికి గాను, మంచి అభివృద్ధి సాధిస్తారు. విదేశీ యాన, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడుతుంది. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఉద్యోగంలో చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి.ఇంట్లో అప్రశాంతత వాతావరణం గోచరిస్తోంది, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, ఖర్చులు అధిక వ్యయంగా గోచరిస్తోంది.  స్థిరాస్తుల పరంగా ఇబ్బందులు రావడం, అప్పుగా ఇచ్చిన డబ్బులు చేతికి రాకపోవడం, రుణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పొదుపు మార్గాన్ని ఎంచుకోవాలి. వివాహ సంబంధాల విషయంలో మీరు కోరుకున్న  సంబంధం రావడం మీ మానసిక సంతోషం లభిస్తుంది. ఈ రాశి వారికీ అర్ధాష్టమ శని నడుస్తోంది, 8  శనివారాలు శనికి తైలాభిషేకం  చేయడం మంచిది. నవగ్రహ హోమం చేయించండి మంచి ఫలితాలుంటాయి. కాలభైరవ   రూపు ధరించండి.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణము ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించే వాళ్లకి మంచి అవకాశం అని చెప్పవచ్చు . వ్యాపారం బాగుంటుంది. క్రయ విక్రయాల విషయంలో ఆచి తూచి అడుగులు వేయండి. అనవసరమైన ఆలోచనలు చేసి మనస్సు పాడుచేసుకోవద్దు. తాత్కాలిక ప్రశాంతత లభిస్తుంది. వ్యవసాయ సంబంధమైన భూములు అమ్మి వేరేచోట కొనాలన్నా మీ ఆలోచన ఆలస్యం అవ్వచ్చు. కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది. వివాహ శుభకార్యాలు సానుకూలంగా వున్నాయి ఈ వారం. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఇది అనుకూలమైన కాలం. సంతానం విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు.  విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి అనుకూలం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు 8  సోమవారాలు రుద్రాభిషేకం చేయడం మంచిది.

మకరం:   మకర రాశి వారికి  ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.భూమి సంబంధిత వ్యవహారములు మీకు అనుకూలముగా ఉంటాయి. వ్యాపార సంబంధమైన విషయాలలో లాభనష్టాల జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఎగుమతి-దిగుమతి వ్యవహారాలలో లాభాలు బాగుంటాయి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  ఉద్యోగ పరంగా మంచి అవకాశం రావడం వల్ల వేరే కంపెనీకి మారుతారు. కష్టానికి తగ్గ ఫలితం తక్కువగా ఉంటుంది. వీసా పాస్పోర్ట్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వింటారు. తల్లితండ్రులు పిల్లల పట్ల చూపే ప్రేమ కన్నా బయటివారు చెప్పే మాటలు ఎక్కువగా ఆకర్షితులవుతారు.  ఏలిన నాటి శని నడుస్తున్న కారణం చేత శనేశ్వరుడికి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం వలన అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. కీళ్ల నొప్పులు, అరికాళ్ళు, గ్యాస్ట్రిక్, షుగర్ విషయంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు నవగ్రహ పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలుంటాయి.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనికి ఎంతో కష్టపడితే గానీ ఫలితం లభించదు. ఆర్థిక పరిస్థితి సర్దుబాటుతోనే నడుస్తుంది.  మీరు ఊహించనటువంటి వ్యాపారంలోనే లాభాలు వస్తాయి. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, అందుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు మధ్యస్తంగా ఉంటాయి. ఖర్చులు అధికం అవుతాయి. విద్య, పోటీ పరీక్షలు విదేశీయానం, విదేశాలలో చదువుకొనడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.గ్రీన్‌కార్డుకోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. పిల్లల పట్ల వారి చదువు పట్ల జాగర్తలు తీసుకోవాలి.  సోదర, సోదరీ వర్గీయుల నుండి, సన్నిహితుల నుండి సానుకూల ఫలితాలుంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం మంచిది. నవగ్రహ ధ్యానం,  కాలభైరవ రూపు ధరించండి మంచి ఫలితాలుంటాయి.

­ మీనం: మీనరాశి వారికి ఈ వారం  అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక ప్రణాళికలు, నూతనమైన రూపు రేఖలను దిద్దుకుంటాయి. నిరుద్యోగులైన విద్యావంతులు పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించి, మంచి ఉద్యోగం సంపాదిస్తారు. ఏలిననాటి శని నడుస్తున్నందు వలన శనేశ్వరుడికి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి, 11 మంగళవారాలు ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ చేయించండి మరియు అఘోరపాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. గృహంలోని ఖర్చులను తగ్గించుటకు చేసే ప్రయత్నములు బెడిసి కొట్టవచ్చును. ఋణాల కొరకు చేయు ప్రయత్నములు ఫలిస్తాయి. బరువైన కొన్ని బాధ్యతలను దించుకుంటారు. కీర్తిని గడిస్తారు. ఆత్మ సంతృప్తి మిగులుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితం ఓ గాడిలో పడుతుంది. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అని కాలం మరోసారి ఋజువు చేస్తుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News