Home తాజా వార్తలు జిల్లా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తా: పువ్వాడ అజయ్

జిల్లా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తా: పువ్వాడ అజయ్

Minister Puvvada Ajay

 

హైదరాబాద్: ఖమ్మం సర్ధార్ పటేల్ మైదానంలో మంత్రి పువ్వాడ అజయ్ కు స్వాగత సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంఎల్ఎ హరిప్రియ, రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి నామానాగేశ్వరరావు మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా పని చేస్తామని, ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ కు గుమ్మం అని ప్రజలు నిరూపించారు.

జిల్లాకు మంత్రి పదవి ఇచ్చిన సిఎం కెసిఆర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదం వలనే తనుకు మంత్రి పదవి దక్కిందాని, అందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన సిఎం కెసిఆర్, కెటిఆర్ లకు ధన్యవాదలు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తాన్నాని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే నిర్విరామంగా కృషి చేస్తా అని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.

Welcome party to Minister Puvvada Ajay at Khammam