Home రంగారెడ్డి విమానాశ్రయంలో ఇవాంకకు స్వాగతం

విమానాశ్రయంలో ఇవాంకకు స్వాగతం

ivanka

మన తెలంగాణ /రంగారెడ్డి జిల్లా : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్  ట్రంప్ కుమార్తె, సలహాదారు  ఇవాంక  ట్రంప్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.  అమెరికా నుంచి ప్రత్యేక విమానం బయలు దేరిన ఆమె  మంగళవారం  తెల్లవారు జాము 3 గంటల ప్రాంతంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఘనస్వాగతం పలికారు.  భారత్‌లోని  అమెరికన్ రాయబారి కెన్‌జుస్టర్,  కాన్స్‌లేట్ జనరల్,  కాథిరినా హడ్డా అమెరికాలోని  భారత రాయబారి  నవతేజ్‌సింగ్,  ప్రభుత్వ ఉన్నతాధికారులు ఐటి  ముఖ్య కార్యదర్శి జయశ్ రంజన్,  పోలీసు సీనియర్ అధికారులు  అంజనీకుమార్, షీకా గోయల్ ఇవాంక ట్రంప్‌కు  ఘన స్వాగతం పలికారు. అనంతరం  భారీ భద్రత మధ్య శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన  ఇవాంక  రోడ్డు మార్గంలో  హైటెక్ సిటీ సమీపంలోని  ట్రైడెంట్  హోటల్‌కు  4 గంటల ప్రాంతంలో చేరుకున్నారు.