Home తాజా వార్తలు మత్స్యకారుల సంక్షేమాభివృద్ధే.. ప్రభుత్వ లక్ష్యం

మత్స్యకారుల సంక్షేమాభివృద్ధే.. ప్రభుత్వ లక్ష్యం

Fishermen

 

వనపర్తి : వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 290 చెర్వుల్లో కోటి 41 లక్షల చేపపిల్లలు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెర్వు ట్యాంక్ బండ్‌లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృష్ణా జలానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా నల్లచెర్వులో మంత్రి చేపపిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో సిఎం కెసిఆర్ కుల వృత్తులకు అధిక ప్రాధాన్యత, రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా, వృత్తిదారులకు, మత్స్యకార్మికుల సంక్షేమం కోసం చేపపిల్లలతో పాటు మత్స్యకారులకు ఉచిత చేపపిల్లలను చెర్వులో విడుదల చేయడం, చేపల క్రయ విక్రయాలకు మార్కెట్ రవాణా, సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం, చేపల కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వం సమకూర్చిందన్నారు.

మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైన ఆహారం అందించేందుకు మత్సకారులు స్వయం ఉపాధిలో రాణించాలన్నారు. మత్స్యకారులకు చేపల క్రయవిక్రయాలకు రవాణా సదుపాయాలు, వేటకు వెళ్లేందుకు వలలు, చేపలు విక్రయించేందుకు ద్విచక్రవాహనాలు, వలలు, మార్కెట్ యార్డుల ఏర్పాటు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ప్రతి ఏడాది మత్స్యసంపదను పెంచడం జరుగుతుందన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా వృత్తికి దూరమైన మత్సకారులు నల్లచెర్వు పునర్నిర్మాణంతో వనపర్తి మత్స్యకారులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. వనపర్తి జిల్లాలో మిగిలిన చెర్వులను పునిర్నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా జడ్పిచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా మత్సశాఖాధికారిణి రాధారోహిణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి. లక్ష్మయ్య, మాజి కౌన్సిలర్స్ వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, ఉంగ్లం తిరుమల్, పిడి.కమలమ్మ, పిడి.జయానందం, నాయకులు లక్ష్మినారాయణ, నందిమల్ల శ్యాంకుమార్, చుక్క రాజు, పాకనాటి కృష్ణ, మత్స్యకార గంగపుత్ర సంఘాల నాయకులు చంద్రయ్య, మన్యం, కాగితాల గిరి, నర్సింహ్మ, రవి, జిజె శ్రీనువాసులు, మహేష్, సుభాష్, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Welfare of Fishermen is the Government’s Goal