Wednesday, April 24, 2024

పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం: మంత్రి హరీష్

- Advertisement -
- Advertisement -

Welfare of poor is goal of TRS govt Says Minister Harish

మెదక్ :  దేశంలో ఏక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడేది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌తోపాటు ఎనిమిది మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ ప్రతి పేదింటి ఆడపడుచుల పెళ్లికి లక్ష 116 రూపాయల ఆర్థిక సహయం అందిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రస్తుతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని గడపగడపకు చేర్చే విధంగా ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారని తెలియజేశారు.

అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక రుణాలను అందజేస్తున్నామన్నారు. ఇందులో తక్కువ మొత్తంలో రుణం తీసుకున్న వారికి 80 నుంచి 90శాతం సబ్సీడి, ఎక్కువ మొత్తంలో రుణాలు పొందిన వారికి 60 నుంచి 70శాతం సబ్సీడి ఇస్తున్నామన్నారు. దేశంలో ఇలాంటి ప్రజల శ్రేయస్సుకోరే ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు. ఈ సబ్సీడి గతంలో బ్యాంకు లింకుతో ఇచ్చేవారిమని అయితే ఇప్పుడు నేరుగా బ్యాంకుతో లింకు లేకుండా ప్రభుత్వమే సబ్సీడీని అందజేస్తుందని తెలిపారు. మిగిలిన కొద్ది మొత్తాన్ని లబ్దిదారులు వీలైనంత త్వరలో సమకూర్చుకొని ఈ స్వయం ఉపాదిని పొందాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి కాబాట్టి పేదల సంక్షేమానికి వీలైనన్ని సవరణలతో కూడిన పథకాలను ప్రత్యేక్షంగా అందేవిధంగా చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కూడా నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

ఎస్సీలకు ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెడుతుందని వీటి వివరాలను పెన్‌డ్రైవ్ ద్వారా అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిదులందరికి అందజేస్తుందన్నారు. ఇందులో ప్రభుత్వం కేటాయించిన నిధులు వాటిలో ఖర్చుపెట్టిన వివరాలు పూర్తిగా పొందుపర్చి ఉన్నాయన్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని తెలిపారు. రైతుల విషయంలో కూడా మనముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చొరవ చూపి వారికి రైతుబందు అందజేస్తున్నారన్నారు. ఇప్పటికే వర్షాకాలంలో వేసిన పంట రైతులకు ఆర్థిక సహయం అందించామని రాబోయే యాసంగిలో కూడా తిరిగి అదే విధంగా ఆర్థిక సహయం అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం 702 కోట్ల రూపాయలను రైతుబంధు కింద టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. అంతేకాకుండా ఆసరాపించన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబందు వంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆపకుండా ఎన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ పేద ప్రజల సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఇతర ఖర్చులు కొన్ని ప్రభుత్వం తగ్గించుకున్నప్పటికీ పేదల సంక్షేమంలో మాత్రం ఎప్పుడు వెనుకాడలేదన్నారు.

ఈ యొక్క అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఎప్పుడు ముందుకు కొనసాగిస్తుందన్నారు. ఎప్పటికప్పుడు పేదలకు చెక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోగల మండల పరిషత్ కార్యాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కాంప్లెక్స్ వల్లమండల పరిషత్‌కు నిధులు వస్తాయని వాటితో గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు జరుపుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో జడ్పీసీఈఓ, ఎండీఓలు నిధులను అత్యంత పారదర్శకంగా ఉపయోగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఆదేశించారు. ఇట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, తహశీల్దార్ రవికుమార్, జడ్పీసీఈఓ లక్ష్మీబాయి,ఎంపీపీ యమునజయరాంరెడ్డి, ఎంపీడీవో రాంబాబుతోపాటు, మెదక్, హవేళిఘనపూర్ మండల పరిషత్ అధికారులు, పలు వార్డుల కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News