Home జయశంకర్ భూపాలపల్లి నీలి విప్లవమే లక్ష్యం

నీలి విప్లవమే లక్ష్యం

Blue Revolution

 

రెండు జిల్లాల నుండి 3 కోట్ల చేపపిల్లలు
ఇప్పటికే 5 కోట్ల సీడ్ పంపిణీ
10 నెలలకి కేజీ బరువు కానున్న చేపలు
11 వేల మత్యకారుల కుంటుంబాలకు ఉపాధి
మత్యశాఖ ఎండీ భాస్కర్

జయశంకర్ భూపాలపల్లి : సమీకృత మత్స అభివృద్ధ్ధి పథకంతో నీలి విప్లవం తేవడమే లక్షంగా మత్సకారుల సంక్షేమం కోరి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతున్నామని ఆ శాఖ ఎండీ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధితో శనివారం మాట్లాడారు. భూపాలపల్లి, ములుగు జిల్లాలలో చేపల పెంపకానికి తగిన వనరులున్నాయని ఇక్కడ వాటి అభివృద్ధ్ది ఆ వృత్తిపై ఆధారపడ్డ వారికి ఉపాధి కల్పించాలనే ఉద్ధేశ్యంతో తమ శాఖ సిద్దంగా ఉందని ఆయన అన్నారు. అందుకోసం ఈ రెండు జిల్లాలకు సంబంధించి సుమారు 3 కోట్ల మేలు రకం చేప పిల్లలను పెంచాలనే టార్గెట్‌తో ఉన్నామని చెప్పారు.

రూ. 2.5 కోట్ల ఖరీదు చేసే చేపపిల్లలు
ఒక అంచనాగా చెప్పాలంటే ప్రాంతంలో ఉన్న జలాశయాలను గుర్తించి అవి చేపల పెంపకానికి అనువైనందున రూ. 2.5 కోట్ల విలువ గల మూడు కోట్ల చేపపిల్ల విత్తనాలను మత్యకారుల సంక్షేమం కోరి పూర్తి సబ్సిడీపై వారికి పంపిణీ చేస్తున్నామన్నారు. అందుకు గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 1.85 కోట్లు, ములుగు జిల్లాకు 1.15 కోట్లు బొచ్చ, రవ్వు, బంగారుతీగ, మెరిగ వంటి మేలైన జాతుల చేపపిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. అందుకు ఇటీవల కాళేశ్వరంలో 3.76 లక్షలు, రామప్పలో 1.30 లక్షల చేపపిల్లలను రాష్ట్ర మత్యశాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ చేతుల మీదుగా వేరు వేరుగా విడుదల చేశామన్నారు. అదేవిధంగా ఈ రెండు జిల్లాల్లో 2.20 లక్షల నాలకంఠ రొయ్య సీడును కూడా చెరువులలో పెంచుతామన్నారు.

ఈ చేపపిల్లలు 8 నుండి 10 నెలల వరకు కేజి బరువు స్థాయికి చేరగా నాలుగు నెలల వరకు రొయ్యలు 100 గ్రాముల రొయ్యల వరకు వృద్ధ్ది చెందుతాయని ఆయన తెలిపారు. మొత్తం 653 చెరువులు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఉన్న 653 చెరువులలో జయశంకర్ జిల్లాలో 416, ములుగు జిల్లాలో 247 చెరువులు ఉన్నాయన్నారు. వాటిలో భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, గణపురం, భీమగణపురం చెరువులు ప్రధాన వనరులైతే మిగతావి చిన్నాపెద్ద చెరువులు కుంటలని అన్నారు. అదేవిధంగా ములుగు జిల్లాలో లక్నవరం, రామప్ప, పాలెంవాగు భారీ ప్రాజెక్టులున్నాయని అవి పోను మిగతా చిన్న చెరువు కుంటలు చేపల పెంపకానికి అనువైనవిగా గుర్తించామన్నారు. ఈ రెండు జిల్లాల్లో 107 మత్సకారుల సంఘాలుంటే అందులో జయశంకర్ జిల్లాలో 87, ములుగు జిల్లాలో 20 సంఘాలున్నాయని వీటిలో 11 వేల మంది మత్సకారులు చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వెల్లడించారు.

రూ. 17 కోట్ల ఉపకరణాలు
మత్సకారుల అభివద్ది కోసం రూపాయలు 17 కోట్ల విలువ చేసే వలలు, టెంట్లు, ఐస్‌ట్రక్కులు, ద్విచక్రవాహనాలు, ట్రాలీలు, చేపల విక్రయం కోసం 4 వేల మంది లబ్దిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు.

26 నుండి సీడ్ విడుదల
ప్రముఖుల చేతి మీదుగా ప్రధాన వనరులలో విడుదల చేసిన సీడ్ పోను, మిగిలిన చేపపిల్లలను ఈ నెల 26 నుండి నిర్ధేషించిన లక్షం మేరకు రోజు ఒక చెరువు, కుంటలలో విడుదల చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ చేసామన్నారు. అందుకు సంబంధించిన అధికారులు మత్యకారులచే సంప్రదింపుల కూడా జరిపారని చెప్పారు. వచ్చే అక్టోబర్ మొదటి వారంలోపు చేపపిల్లల సీడ్‌ను అన్ని వనరులలో విడుదల చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

చేప పిల్లల పెంపకంతో వేలాది మంది మత్సకారులకు ఉపాధి కలిగించే ఈ పరిశ్రమ వృధ్దికోసం వాటిని ప్రోత్సహించి అంకిత భావంతో వారికి అందుబాటులో ఉండేందుకు అప్రమత్తం అయ్యారని చెప్పారు. మత్సకారుల అభిరుచిని బట్టి టన్నుల కొద్ది చేపపిల్లల పెంపకంతో వారి ఆసక్తిని గమనించి ఈ ప్రాంతంలో చేపల పరిశ్రమ భారీగా వృద్దిచెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ శాఖ ఎండీ భాస్కర్ చెప్పారు.

Welfare of the Fishermen with the Blue Revolution