- Advertisement -
రంగారెడ్డి: దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కేటిఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో కేటిఆర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందరంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రి కేటిఆర్, మహేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేత నోముల కృష్ణగైడ్ కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ ఇప్పటికే ఇబ్రహింపట్నం నియోజకవర్గానికి ఆరుసార్లు వచ్చినట్లు అన్నారు. ప్రాజెక్టుల కోసం ప్రతీ ఏడాది రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. నీళ్లివ్వకుంటే ఓట్లు మేము అడగమని చెప్పిన మహా నేత కేసిఆర్ అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ అని తెలిపారు.
- Advertisement -