Home ఆఫ్ బీట్ సంక్షేమ పథకాలు భళా

సంక్షేమ పథకాలు భళా

KCR

ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి అభి వృద్ధి, మెరుగైన సేవలను అందించడానికి సంక్షేమం అనే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ళుగా సాగిస్తున్న పరిపాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని అనేక వినూత్న, విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు తెలంగాణలో కనిపిస్తాయి. అమలును అధ్యయనం చేసిన అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అక్కడ కూడా అమలుచేయడంపై దృష్టి సారించాయి. తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, రైతుబంధు లాంటి అనేక పథకాలను బిజెపి కర్నాటక ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. కొత్త రాష్ట్రమే అయినా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం తెలంగాణ దూరదృష్టికి, ప్రజాకర్షక పాలనకు నిదర్శనం.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 

DSC_1093

బడుగు, బలహీన, వెనుకడిన వర్గాలకు చెందిన యువతుల వివాహం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు విశేష ప్రజాదరణ పొందడమేకాక దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఈ పథకం కింద ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఇబిసి వర్గాల పేద అమ్మాయిల పెళ్ళిళ్ళకు ప్రభుత్వం లక్ష116 రూపాయాల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అక్టోబర్ 21, 2014న ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల వర్గాల పేద అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసం రూ.51వేల ఆర్థిక సహాయం అందించేలా ప్రారంభమైన ఈ పథకం బిసిలకు కూడా విస్తరింపజేసింది ప్రభుత్వం. ఆర్థిక సహాయం సైతం రూ.75,116లకు పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం కింద అందజేసే ఆర్థిక సహాయం లక్షా 116 రూపాయలకు పెరిగింది. ఈ పథకం కింద ఏప్రిల్ నాటికి 3,23,963 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. ప్రభుత్వం రూ.1965 కోట్లు ఖర్చుచేసింది. షాదీ ముబారక్ పథకం కింద 86,104 మంది లబ్దిదారులకు రూ.1650 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చుచేసింది. 4,581 మంది ఇబిసిలు కూడా ఈ పథకం కింద లబ్దిపొందారు.

హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం

dc-Cover-39khkuq1dt17vvvujkpt4kj217-20160305064705.Medi

తెలంగాణ రాష్ట్రంలోని హాస్టల్ విద్యార్థులకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వం జనవరి 1,2015 నుంచి సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది. 2016-17 నుండి కాలేజీ విద్యార్థులకు కూడా సన్నబియ్యాన్ని ఇస్తోంది. ఈ పథకం ద్వారా పాఠశాలలు, హాస్టళ్ళు, అంగన్‌వాడీలలో చదివే 47.65 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వం ఏటా 612.24 కోట్ల ఖర్చు చేస్తోంది.

బ్రాహ్మణ సంక్షేమానికి వంద కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలవారి సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చర్యలు తీసుకుంటున్నారు. సమాజంలో ఇతర వర్గాల లాగానే బ్రాహ్మణ సామాజికవర్గంలో కూడా పేదలు ఉన్నారని వారి సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేశారు.

ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమం

BN-BO481_itelan_G_20140218080508

ఎస్‌సి, ఎస్‌టిలకు 100 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని వల్ల తెలంగాణలో 25 మంది ఎస్‌సి రైతులు, 10 మంది ఎస్‌టి రైతులు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌లు కాగలిగారు. షెడ్యూల్డ్ ఏరియాలోని 13 వ్యవసాయ మార్కెట్‌లలో కూడా ఎస్‌టిలే మార్కెట్ కమిటీల చైర్‌పర్సన్‌లయ్యారు. ఎస్‌సిలకు 134 గురుకులాలు (104 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలు), ఎస్‌టిల కోసం 51గురుకులాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 268 ఎస్‌సి గురుకులాల్లో 1, 12,493 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్‌టిల కోసం కొత్తగా 21 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 14 బాలికలు, 7 బాలుర కాలేజీలు ఉన్నాయి.  తెలంగాణ ఏర్పడక ముందు ఒకే ఒక్క ఎస్‌సి స్టడీ సర్కిల్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 9 స్టడీ సర్కిళ్ళను మంజూరు చేసింది. నాలుగు స్టడీ సర్కిళ్ళు ఉన్న ఎస్‌టిలకు మరిన్ని ఎస్‌టి స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్‌ను రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచి మార్చి 2018 నాటికి 532 ఎస్‌సి విద్యార్థులకు రూ.184.31 కోట్లు మంజూరు చేసింది. 146 మంది ఎస్‌టి విద్యార్థులకు రూ.23.45 కోట్లు మంజూరు చేసింది.

ఎకనమిక్ సపోర్టు స్కీం సబ్సిడీ పెంపు

నిరుపేద నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎకనమిక్ సపోర్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుణ సదుపాయంలో సబ్సిడీని కూడా భారీగా పెంచింది. గతంలో రూ.30 వేలు గరిష్ట సబ్సిడీగా ఉంది. ఇప్పుడు రూ. లక్ష రుణాలకు రూ.80 వేలు, రూ.2 లక్షల రుణాలకు రూ. 1.2 లక్షలు, రూ.5 లక్షల రుణాలకు రూ.2.50 లక్షలు చొప్పున సబ్సిడీని అందిస్తోంది. 2018-19 బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ. 1,682.53 కోట్లు కేటాయించింది. మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి లకు ఈ పథకం కింద 2013-14లో 32,136 మంది లబ్దిదారులకు రూ. 13.54 కోట్లు, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 67,442 మంది లబ్దిదారులకు రూ.344.45 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 19,821 మంది లబ్దిదారులకు రూ.201.56 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 49,200 మంది లబ్దిదారులకు రూ.536.27 కోట్లు  ఖర్చుచేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 66,185 మంది లబ్దిదారులకు రూ. 694.6 కోట్లు కేటాయించింది.

పది లక్షల వరకు వడ్డీ లేని స్త్రీ నిధి

dc-Cover-h2rp70ekf2qvs87sql0g6skam6-20170503071401.Medi

తెలంగాణ రాష్ట్రంలోని 4.45 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 83.58 లక్షల కుటుంబాలకు ఉపయోగపడేలా గ్రూపుల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇందు కోసం రూ. కేటాయింపులకు రూ.700 కోట్ల నుంచి రూ.1400 కోట్లకు పెంచారు. వడ్డీలేని రుణం కోసం ప్రభుత్వం 441 కోట్లు వ్యయం చేస్తోంది.

ఒంటరి మహిళలకు రూ.1000 భృతి

రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతూ ఆర్థిక పరిస్థితులతో కష్టాలు పడుతున్న మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఒంటరి మహిళలకు ప్రతీ నెలా రూ. 1000 చొప్పున భృతిని అందిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.172.92 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా అక్టోబర్ 24, 2017 నాటికి 1,19,640 మంది లబ్దిపొందారు.

మహిళా, శిశు సంక్షేమం

సమాజంలో సగభాగం ఉన్న మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని సంకల్పించిన ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్‌లో రూ.1,552 కోట్లు, 2017-18 బడ్జెట్‌లో 1,731 కోట్లు, 2018-19 బడ్జెట్‌లో రూ.1,799 కోట్లు కేటాయించింది.  మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు , చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం ‘ఆరోగ్యలక్ష్మి’ పథకాన్ని జనవరి 1,2015 నుండి అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 35, 700 అంగన్‌వాడీ కేంద్రాలు, 149 ఐసిడిఎస్ ల ద్వారా ఈ కార్యక్రమం అమలవుతోంది. ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం 298 కోట్లు కేటాయించింది. గ్రామీణ మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణీలను ప్రసవ సమయానికి దవాఖానకు చేర్చడం, ప్రసవం తర్వాత పట్టిన బిడ్డతో పాటు కుటుంబ సభ్యులను కూడా సురక్షితంగా ఇంటికి చేర్చడానికి ప్రభుత్వం ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేస్తోంది.

జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమం

243021397

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం 2014-15 నుంచి 2016-17 వరకు బడ్జెట్‌లో వరుసగా పది కోట్ల రూపాయల చొప్పున రూ.30 కోట్లు కేటాయించింది. 2017-18 బడ్జెట్‌లో రూ. 30 కోట్లు, 2018-19 బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించింది. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఐదేళ్ళ వరకు వారి కుటుంబానికి రూ. 3 వేల చొప్పున పెన్షన్, గాయపడి నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వారికి రూ.50 వేలు చొప్పున ఇస్తోంది. 69 జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. పైసా ఖర్చు లేకుండా ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా వెల్‌నెస్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందిస్తోంది.
న్యాయవాడులకు రూ.100 కోట్లు : హై కోర్టు సహా రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులకు గౌరవవేతనాలను ప్రభుత్వం భారీగా పెంచింది. కోర్ట్ ఆఫ్ అప్పీళ్ళలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులకు గౌరవ వేతనం రూ.75 వేల నుంచి రూ.లక్షా 25 వేలకు, ప్రభుత్వ న్యాయవాదుల వేతన రూ.55 వేల నుంచి రూ. లక్షకు, సహాయ న్యాయవాదుల వేతనం రూ.22 వేల నుంచి రూ. 44 వేలకు పెంచారు.

రైతు అభ్యున్నతే ప్రధానం..

రైతుబంధు గ్రూప్ బీమా : రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి రైతులందరికి రూ.5లక్షల వరకు రైతుబంధు గ్రూప్ బీమాను అమలుకానుంది. ఇందుకోసం బడ్జెట్‌లో ఇప్పటికే రూ.500 కోట్లు కేటాయించింది. 18 నుంచి 60 ఏళ్ల వయ స్సు వరకు ఉన్న రైతులకు బీమా సౌకర్యం కల్పించనుంది. ఇందుకు దాదాపు రూ.948 కోట్లు అవసరమౌతాయని అంచ నా వేస్తోంది. రైతులు సాధారణ మరణం చెందినా, ఇంకా ఏ కారణం చేత మరణించినా బీమా పరిహారం అందనుంది.
అన్నదాతకు అండగా.. రైతుబంధు : దేశంలోనే తొలిసారిగా రైతులను ఆదుకునేందుకు ‘రైతుబంధు’ పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ ఇస్తోంది. మే 10న ప్రారంభమైన ఈ వినూత్న పథకం ద్వారా 10558 గ్రామాల్లో ఈ సీజన్‌లో 57.89 లక్షల చెక్కులను రైతులకు ఒక్కో ఎకరానికి రూ.4000 చొప్పున చెక్కు రూ పంలో అందిస్తోంది. ఇందులో ఇప్పటివరకు 46 లక్షల చెక్కులు పంపిణీ జరిగింది. ఈ పథకం ద్వారా 1.40 కోట్ల ఎకరాలకు మొదటి విడతలో రూ.5,588.62 కోట్లను ఖర్చు చేసింది.
సబ్సిడీపై వరినాటు యంత్రాలు, ట్రాక్టర్లు : శ్రమతో పాటు ఖర్చును తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ విధానంలో రైతులకు ట్రాక్టర్లను అందజేస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 522 కోట్లను కేటాయించడంతో పాటు ట్రాక్టర్లపై రవాణా పన్నును రద్దుచేసంది. గతేడాది మార్చినాటికే సుమారు 14 వేల ట్రాక్టర్లను సబ్సిడీపై అందజేయగా ఈ ఏడాది ఒక్కో మండలానికి పది చొప్పున వరినాటు యంత్రాల చొప్పున మొత్తం ఐదున్నర వేల యంత్రాలను అందజేయనుంది. చిన్న, సన్నకారు, బి.సి. రైతులకు ట్రాక్టర్లు, వరినాటు యంత్రాలు, స్ప్రేయర్లు, డ్రిప్ పరికరాలపై గరిష్టంగా 85 శాతం సబ్సిడీ ఇస్తోంది.
పట్టాదారు పాస్‌బుక్ : పాస్‌పోర్టుకు అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 57.33 లక్షల పట్టాదారు పాస్‌బుక్‌లను రూపొందించిన ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ అందజేస్తోంది. పాస్‌బుక్‌లోనే ప్రత్యేక యూనిక్ కోడ్, బార్‌కోడ్, ఆధార్ నెంబరు, భూ విస్తీర్ణం, సర్వే నెంబర్ లాంటివన్నీ ఉంటాయి.
సమీకృత మత్స అభివృద్ధి : మత్స పరిశ్రమ అభివృద్ధి కోసం వందశాతం సబ్సిడీతో2.40 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూరే విధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ జరుగుతోంది. ఏటా 3.20 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలనే లక్షంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈసారి 72 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రొయ్యల పెంపకంలో మత్సశాఖ అధ్బుత ఫలితాలను సాధిస్తోంది.
రైతు సమన్వయ సమితులు : వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో రైతు సమన్వయ సమితిలు ఏర్పాటయ్యాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ సమితులు రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలనే అంశం మొదలు పంటలకు మద్ధతు ధర కల్పించడం, మార్కెట్‌లో విక్రయించడం, సీజన్‌లవారీగా ఏ పంటలకు ఏ మేరకు డిమాండ్ ఉంటుందో అవగాహన కలిగిస్తాయి. రైతులతో ఇవి తరచూ స మావేశం కావడానికి వీలుగా ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక రైతు వేదిక ఏర్పాటవుతుంది. ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.12లక్షల చొప్పున మొత్తం రూ.300 కోట్లను కేటాయించింది.
గోదాముల ఏర్పాటు : రాష్ట్రం ఏర్పడే నాటికి గోదాముల్లో నిల్వ సామర్థం కేవలం నాలుగు లక్షల టన్నులు మాత్రమేకాగా వెయ్యి కోట్ల రూపాయలతో ఇప్పటికే 18 లక్షల టన్నుల సామర్థానికి చేరుకుంది. త్వరలో ఇది 23 లక్షల టన్నులకు చేరుకోనుంది. గిట్టుబాటు ధర వచ్చేంతవరకు పంటలను నిల్వ చేసుకోడానికి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ల నిర్మాణం కోసం రూ. 132 కోట్లను కేటాయించింది. గ్రీన్‌హౌస్, పాలీహౌస్ సేద్యానికి 95% సబ్సిడీతో 1150 ఎకరాలకు రూ. 363 కోట్లను మం జూరు చేసింది. మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం, పనిచేసే హమాలీల కోసం సద్ధిమూట పథకాన్ని విజయవంతం గా అమలు చేస్తున్నా రు. అలాగే మన కూరగాయలు పథకంతో రైతులకు గిట్టుబాటు వచ్చేలా చేస్తున్నారు.