న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ను అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలకు ఉచితంగా ఇవ్వకుంటే తమ సొంత నిధులతో తామే ఉచితంగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రజలు చాలావరకు ఆర్థికంగా దెబ్బతిన్నారని, వ్యాక్సిన్ ఖర్చును భరించలేరని ఆయన చెప్పారు. అందుకనే ప్రభుత్వం తప్పనిసరిగా ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ఆయన సూచించారు.