Home జాతీయ వార్తలు ప్రధాని మోడీతో మమత భేటీ

ప్రధాని మోడీతో మమత భేటీ

Narendra Modiఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో  ప‌శ్చిమ బెంగాల్ సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు.  త‌మ రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చాలని ఆమె మోడీని కోరారు. మోడీతో భేటీ అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీతో భేటీ మంచిగా సాగిందని ఆమె తెలిపారు. బెంగాల్ పేరు మార్పు గురించి  మోడీతో చ‌ర్చించిన‌ట్లు ఆమె వెల్లడించారు. దీనికి మోడీ సానుకూలంగా స్పందించారని ఆమె చెప్పారు. బీర్‌బ‌మ్ జిల్లాలో జ‌ర‌గ‌నున్న కోల్ బ్లాక్ డియోచా ప‌చామీ స‌ద‌స్సుకు మోడీని  ఆహ్వానించిన‌ట్లు మమత పేర్కొన్నారు. కోల్ బ్లాక్ ప్రాజెక్టును సుమారు 12వేల కోట్లతో చేప‌డుతున్న‌ట్లు  ఆమె పేర్కొన్నారు. ఎన్ఆర్‌సిపై మోడీతో తాను చర్చించలేదని ఆమె స్పష్టం చేశారు.

West Bengal CM Mamata Meets PM Narendra Modi