Home జాతీయ వార్తలు పశ్చిమ బెంగాల్‌లో 18 శాతం…. అసోంలో 12 శాతం పోలింగ్

పశ్చిమ బెంగాల్‌లో 18 శాతం…. అసోంలో 12 శాతం పోలింగ్

VOTEకోల్‌కతా: అసోం, పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరుకు జరుగుతాయి. ఇప్పటి వరకు అసోంలో 12 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 18 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పశ్చిమ బెంగాల్‌లో జంగల్ మహల్ పరిధిలో 18 శాసన సభ స్థానాలకు, అసోంలోని 65 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెస్ట్ మిడ్నాపూర్, పురూలియా, బంకురా జిల్లాలో 13 స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగనుంది. పోలింగ్ దృష్టా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.