Thursday, April 18, 2024

గేల్ కూడా జాతి వివక్ష బాధితుడే

- Advertisement -
- Advertisement -

బార్బడోస్: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్‌గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా పలు సార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్‌లు ఆడే సమయంలో తాను పలు సార్లు జాతి వివక్షకు గురయ్యానని వాపోయాడు. ఇటీవల అమెరికాలో ఓ నల్ల జాతీయుడిని పోలీసు అధికారి హత్య చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్త మవుతున్న విషయం తెలిసిందే. జాతి వివక్షకు నిరసనగా అమెరికాలో హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నాయి. పలు నగరాల్లో నల్ల జాతీయులు విధ్వంసం సృష్టిస్తున్నారు.

దీంతో చాలా నగరాల్లో కర్ఫూను విధించారు. ఇదిలావుండగా అమెరికాలో జరిగిన జాతి వివక్ష ఉదాంతంపై యూనివర్సల్ బాస్ గేల్ స్పందించాడు. తాను కూడా పలు సార్లు జాతి వివక్షకు గురికావాల్సి వచ్చిందని సంచలన ప్రకటన చేశారు. కొన్ని సార్లు అయితే సొంత జట్టులోనే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నాడు. అయితే ఏ జట్టులో ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నాడో గేల్ పేర్కొనలేదు. కానీ, క్రికెట్‌లో కూడా ఇప్పటికీ జాతి వివక్ష కొనసాగుతుందని, చాలా మంది నల్ల జాతీయ క్రికెటర్లు పలు సార్లు ఇలాంటి వివక్షకు గురికాక తప్పడం లేదన్నాడు. తాను ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో ఆడతానని, కొన్ని సార్లు శ్వేత జాతీయ క్రికెటర్లతో అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చిందని గేల్ వాపోయాడు.

West Indies Cricketer Chris Gayle also a racism victim

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News