Home ఎడిటోరియల్ కుమార్తెలను కన్న వారేమి కావాలి!

కుమార్తెలను కన్న వారేమి కావాలి!

Girls2

అబార్షన్ చట్టాలపై పోలెండ్ మహిళలు ఉద్య మిస్తున్నారు. సౌదీ అరేబియాలో మహిళలు “నేనే నా సంరక్షకురాలిని” అంటూ నినది స్తున్నారు. భారత దేశంలో ముస్లిం మహిళలు తలాక్‌ల విషయంలో గొంతువిప్పి మాట్లాడుతున్నారు. ఈ నేప థ్యంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హిందూ కుటుంబం లో స్త్రీలను పురుషులకు సబార్డినేట్స్ చేసింది.
హిందూ కుటుంబంలో పురుషుడు తన తల్లి దండ్రులతో కలిసి ఉండడం, వారిని ఆదుకోవడమన్న సదాచారాలు పాటించకుండా అడ్డుకుంటూ, వేరు కాపరం పెట్టించాలనుకునే భార్యకు “క్రూరత్వం” కారణంతో విడాకులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు చెప్పిం ది. జస్టిస్ అనిల్ ఆర్. దావే, జస్టిస్ ఎల్. నాగేశ్వర రావుల ధర్మాసనం తీర్పు నిస్తూ వివాహం తర్వాత భర్త కుటుంబంలో భార్య భాగమైపోతుందనీ, భర్త ఆదా యాన్ని అనుభవించడానికి భర్తతో వేరు కాపరం పెట్టిం చడం కుదరదని. అలా చేయడం భర్త పట్ల క్రూరంగా వ్యవహరించడంగా పరిగణించబడుతుందని పేర్కొంది. భార్య ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా ఆత్మహత్య చేసుకోవడం వల్ల భర్త మానసిక వ్యథ కు గురవుతాడని పేర్కొంది. అయితే భార్య ఆత్మహత్య కు ప్రయత్నించ డానికి దారితీసిన పరిస్థితుల గురించి ప్రస్తావన లేదు.
బిబిసిలో వచ్చిన ఒక కథనం ప్రకారం భారత దేశంలో మహిళల ఆత్మహత్యలకు ముఖ్యకారణం వివాహం తర్వాత ఆమె ఆకాంక్షలకు తగిన జీవితం లభించకపోవడమే.
తల్లిదండ్రులను చూసుకోవడం, వేరుకాపరం పెట్టకపోవడం కుమారుడిగా భర్త సదాచరణలుగా భావించడం బాగానే ఉంది కాని అదే సూత్రం భార్యకు ఎందుకు వర్తించదు? కుమార్తెగా భార్య తన స్వంత తల్లిదండ్రులను చూసుకోవడం కూడా ఆమెకు సంబంధించిన సదాచరణ కాదా?
భర్త తన తల్లిదండ్రులతో కలిసి ఉండడాన్ని, వారిని ఆదుకోవడాన్ని భార్య అంగీకరించకపోతే, వేరు కాపరం కావాలని కోరితే భర్తకు విడాకులిచ్చే హక్కు ఉందనడం చాలా ఆందోళనకరమైన విషయమే. మహిళలను రెండవతరగతి పౌరులుగా భావించడం తప్ప మరేమీ కాదిది. కేసు వివరాల్లోకి వెళితే నరేంద్ర, మీనా దంపతులు వివాహం తర్వాత ఘర్షణ పడడం ప్రారంభమైంది. 1992లో వివాహమైంది. పెళ్లి అయిన ప్పటి నుంచి తన భార్య తనను అనుమానిస్తూ వేధిస్తోం దని, తల్లిదండ్రుల నుంచి వేరుపడి వేరు కాపరం పెట్టా లని పోరుతున్నదని భర్త కేసు పెట్టాడు. అలా చేయక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుం దని, 1995లో ఆత్మహత్యా యత్నం కూడా చేసిందని తెలియజేశాడు. 2001లో ట్రయల్ కోర్టు భర్తకు విడాకుల డిక్రీ ఇచ్చింది. కాని కర్నాటక హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టేసింది. చివరకు కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. భార్య తరఫున న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. కాబట్టి భర్త లాయరు చేసిన వాదనను మాత్రమే ఏకపక్షంగా తీసుకుంటూ కోర్టు నిర్ణయం తీసుకుంది. నిజానికి ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించినా సరిపోయేది. కాని సుప్రీంకోర్టు మరికాస్త ముందుకు వెళ్ళి హిందూ కుటుంబంలో కుమారుడి నైతిక విధులు, హిందూ మహిళ పాటించ వలసిన నైతిక నియమాలను వివరించడానికి పూను కుంది. అలా ఎందుకు చేశారో గౌరవనీయులైన న్యాయమూర్తులు మాత్రమే చెప్పగలరు.
భార్య ప్రవర్తన అత్యంత భయానకంగా ఉందని జస్టిస్ దావే అభిప్రాయపడ్డారు. ఏ భర్త కూడా అలాంటి ప్రవర్తనను భరించడని అన్నారు. “భార్య కోరిక మేరకు తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరు కాపరం పెట్టడం అనేది భారతదేశంలో జరగదని, హిందూ కుమారుడు ఇలా చేయడం ఏమాత్రం అభిలషణీయం కాదని కూడా అన్నారు. ప్రతి కుమారుడికి తన తల్లిదండ్రు లను చూసుకోవలసిన నైతిక, చట్టపరమైన బాధ్యత ఉందని చెప్పారు. ఇది కేవలం ఆర్థికంగా ఆదుకోవడం మాత్రమే కాదు, సాంస్కృతికమైనది కూడా. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా పెళ్ళయిన వెంటనే లేదా యుక్త వయసుకు రాగానే కుమారుడు తన తల్లిదండ్రులకు వేరుగా ఉంటాడు. కాని భారత ప్రజలు దీన్ని ఆమో దించరని, సాధారణంగా పెళ్ళి తర్వాత భర్త కుటుంబంతో భార్య కలిసి ఉండాలని, కుమారుడు తన తల్లిదండ్రులను చూసుకోవడం హిందూ సమాజంలో సాధారణమనీ, భర్త ఆదాయం తాను అనుభవించాలని హిందూ మహిళ కోరడాన్ని హైకోర్టు సమర్ధించింది కాని అది చెల్లదనీ, హిందూ కుమారుడి సదాచార విధులకు అది విరుద్దమని కోర్టు పేర్కొంది. భర్త కుటుం బంలో భార్య అంతర్భాగం కాబట్టి ఆమె వేరుకాపరం కావాలనడం అనుచితం అని అభిప్రాయపడింది.
ఈ అభిప్రాయాలు పరిశీలిస్తే స్త్రీలు పురుషులకు సమానం కాదని, పురుషుల కన్నా తక్కువన్న మన స్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కుటుంబంలో మహిళ లు నిర్వర్తించే విధులను బట్టి మంచి భార్య, మంచి కుమార్తె, మంచి తల్లి వగైరా బిరుదులు ఇవ్వడానికి ఉద్దేశించిన కట్టుబాట్లను చెబుతున్నాయి. అంతేకాదు, భర్త మానసిక ప్రశాంతతకు ఎలాంటి భంగం కలుగ కుండా జాగ్రత్తగా భర్త కుటుంబంలో భాగమై పోవాలన్న ఆంక్ష పెడుతున్నాయి.
విడాకులను మంజూరు చేస్తు ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్ధానం సమర్ధిం చడం గురించి చర్చ లేదు. నిజానికి ఆ దంపతులు గత రెండు దశాబ్ధాలుగా కలిసి ఉండడం లేదు కూడా. ఇక్కడ సమస్య కోర్టులు హక్కులను కాపాడే పాత్ర నుంచి నైతిక ప్రవర్తనను నిర్దేశించే, ధార్మిక ప్రవర్తనను నిర్దేశించే పాత్ర పోషించడం గురించి. మహిళ అంటే కేవలం ఒక భార్య, తల్లి, కుమార్తె, చెల్లి వగైరా పురుషు డికి సంబంధించిన పాత్రల చట్రంలోనే ఇరికించడం జరుగుతోంది. ఆ పాత్రలకు నిర్దేశించిన నైతిక, ధార్మిక విధులకు కట్టుబడాలన్న ఆలోచనే ఇందులో ఉంది. పురుషాధిక్యత ఉన్న ఉమ్మడి కుటుంబానికే ప్రాము ఖ్యం ఇవ్వడం జరుగుతోంది. వివాహం తర్వాత భార్యగా భర్త జీవితంలోకి స్త్రీ వస్తుందన్న భావన ఉందే కాని, వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు – ఆడ, మగ- సమానస్థాయిలో కలిసి ఉండడానికి నిర్ణయించు కున్నారన్న భావన లేదు. భర్తకు పాదాభివందనం అనేది కూడా అందులో భాగమే. కాళ్ళపై పడి నమస్క రించడం అనేది వ్యక్తిత్వాన్ని కుప్పకూల్చే అంశం.
భర్త తన తల్లిదండ్రులకు భార్య సేవ చేయడం లేదని, తల్లిదండ్రుల బాగోగులు తనను చూడనీయడం లేదని, అత్తామామలను సరిగా చూడడం లేదని, వేరు కాపరం కోసం ఒత్తిడి చేస్తుందంటూ ఆరోపించడానికి, విడాకులిస్తామంటూ బెదిరించడానికి, భార్యను వేధిం చడానికి ఈ తీర్పు ఉపయోగపడే అవకాశాలు న్నాయి.
దేశంలోని అత్యున్నత న్యాయస్ధానం నుంచి ఇలాంటి అభిప్రాయాలు రావడం మరింత ఆందోళన కలిగించే విషయం. రాజకీయ నాయకత్వానికి ఇది సూచనలిస్తుంది. ఒక విధమైన కుటుంబవ్యవస్థను దెబ్బతినకుండా కాపాడాలన్న సూచనలందించే అభి ప్రాయాలివి.
కుటుంబ వ్యవస్థ సమాజానికి చాలా అవసర మన్నది కాదనలేని నిజం. కుటుంబాన్ని కాపాడ్డానికి వ్యక్తిగత హక్కులను అవసరమైతే వదులుకోవడం అనేది స్త్రీ పురుషులు ఇద్దరి విషయంలోను న్యాయ బద్దంగా ఉండాలి. పెళ్ళయిన తర్వాత దంపతులది ప్రత్యేక కుటుంబం అవుతుంది. కాని భర్త కుటుంబం లో దంపతులిద్దరు అంతర్భాగం అయిపోవాలని వాది స్తే భార్య కుటుంబంలో ఎందుకు అంతర్భాగం కారా దన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. భార్యా భర్తల మధ్య సంబంధం పరస్పర గౌరవాదరాలు, ప్రేమాభి మానాల పునాదులపై ఉండాలే కాని, విధులు, బాధ్యతలు, అధి కారాలు, హక్కుల చట్రంలో బిగించడం మంచిది కాదు.
ముసలి తల్లిదండ్రులను వదిలేయడం, లేదా వారి నుంచి వేరుపడడం, లేదా వారిని పట్టించుకోకపోవడం అనేది కూడా సమాజానికి మంచిది కాదు. కాని ముస లివారయిన తల్లిదండ్రులు, భర్త తల్లిదండ్రులు కాని, భార్య తల్లిదండ్రులు కాని వారిని చూసుకునే బాధ్య తను ఖచ్చితంగా నిర్దేశించే చట్టాలు కావాలి. ముసలి తల్లిదండ్రులను పుణ్యతీర్థాలలో వదిలేయడాన్ని నివా రించడానికి, ముసలి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా వ్యవహరించేవారిని శిక్షించడానికి తగిన చట్టాలు కావాలి. ఆ చట్టాలు భర్త తల్లిదండ్రులకు వేరుగా భార్య తల్లిదండ్రులకు వేరుగా కాదు, ఎవరి తల్లి దండ్రులైన సరే వర్తించేలా ఉండాలి. కొడుకులే లేని దంపతులను చూసుకునే బాధ్యత ఎవరిది, కుమార్తెలు కాకపోతే ఎవరు చూస్తారు? న్యాయం ప్రాతిపదికన హక్కులు, బాధ్యతలను నిర్దేశించే చట్టాలు రావడం అవసరం.
భర్తయినా, భార్యయినా ఎవరి తల్లిదండ్రులైనా పెద్దలుగా వారి బాగోగులు చూస్తూ పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలున్నప్పుడే కుటుంబమైనా, సమాజ మైనా ఉత్తమంగా ఉంటుంది. ఎవరో ఒకరి తల్లిదండ్రు లకు ప్రాధాన్యత ఇచ్చి మరొకరి తల్లిదండ్రుల గురిం చి మాట్లాడకపోవడం లైంగిక వివక్షను సూచిస్తుంది.

????????????????????????????????????
వాహెద్ అబ్దుల్

-7093788843