Wednesday, April 24, 2024

అదిరిపోయే మాస్ సాంగ్

- Advertisement -
- Advertisement -

 Bheeshma

 

నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. ఇప్పటివరకు రిలీజైన సినిమా పోస్టర్లు, సాంగ్స్ చూస్తే ఇదో క్లాసీ లవ్ స్టోరి అని అర్థమవుతోంది. పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. తాజాగా తొలి సాంగ్ ‘వాటే బ్యూటీ…’ విడుదలైంది. అదిరిపోయే మాస్ సాంగ్ ఇది. నితిన్ పర్‌ఫెక్ట్ క్లాసీ స్టెప్స్‌తో మైమరిపిస్తే.. రష్మిక తన అందచందాలతో మురిపించింది. రష్మికలో ఎనర్జీని, అందాల ఆరబోతతో ట్రీట్‌ని తెలివిగా ఈ సినిమాకు ఉపయోగించుకుంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, తాజా సాంగ్‌లో రష్మిక అందాల ఆరబోత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహతి స్వర సాగర్ మాస్ బీట్ ఎనర్జిటిక్‌గా అలరించింది. ఇక ‘వాటే బ్యూటీ…’ సాంగ్ ప్రస్తుతం యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. పోస్టర్లు, పాటల ప్రచారంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఆ స్థాయిలో థియేటర్లలో ‘భీష్మ’ మెప్పిస్తాడా? అన్నది చూడాలి.

Whattey Beauty song release from Bheeshma
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News