Thursday, February 2, 2023

మహిళలను తక్కువ చేసి చూడొద్దు

sania-mirzaటెన్నిస్ స్టార్ సానియా మీర్జా
- Advertisement -

న్యూఢిల్లీ : క్రీడారంగంలో మహిళలను తక్కువ చేసి చూడడం మంచి కాదని భారత టెన్నిస్ సానియా మీర్జా పేర్కొంది. ఇటీవల కాలంలో మహిళా క్రీడాకారిణిలు అసాధారణ ఆటతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించింది. కాగా, ‘ఆటలు ఆడితే నిన్నెవరూ పెళ్లి చేసుకోరు’ అంటూ క్రీడల్లోకి రాకుండా ఆడపిల్లల్ని నిరుత్సాహ పరచవద్దని సానియా విజ్ఞప్తి చేసింది.

ఇక, తాను కూడా మహిళా క్రీడా ప్రపంచంలో భాగస్వామినైనందుకు గర్వపడుతున్నానని తెలిపింది. పురుషులతో పాటుగా మహిళలకు సమానమైన అవకాశాలు రానప్పటికీ.. నేడు ఎంతో మంది మహిళా క్రీడాకారిణిలు దేశ కీర్తి పతాకను ఎగురవేస్తున్నారని వివరించింది. ఇక సమాన అవకాశాలు లభిస్తే ఆకాశమే హద్దుగా చెలరేగి… తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకుంటారని సానియా అభిప్రాయపడింది. కానీ, దీనికి సమాజంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ముఖ్యమని తెలిపింది.

తల్లిదండ్రులు, బంధువుల ఆలోచనాసరళిలో మార్పు వచ్చినపుడే అమ్మాయిలు క్రీడల్లో రాణిస్తారని చెప్పింది. చిన్నపుడు పీటీ ఉషను చూసి స్ఫూర్తి పొందానని.. ప్రస్తుతం పి.వి. సింధు, సైనా నెహ్వాల్, దీపా కర్మాకర్ వంటి ఎంతో మంది క్రీడారంగంలో తమదైన ముద్ర వేస్తున్నారని సానియా ప్రశంసించింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా.. ‘మహిళలు- నాయకత్వం’ అనే అంశం మీద గురువారం జరిగిన ప్యానల్ డిస్కషన్స్‌లో ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా గుడ్‌విల్ అంబాసిడర్ సానియా మీర్జా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ నాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచీ వింటున్నా. ఎండలో ఆడితే నల్లబడతావు.

అప్పుడు నిన్నెవరూ పెళ్లి చేసుకోరు అంటూ బంధువులు నన్ను బెదిరించేవారు. ప్లీజ్… తల్లిదండ్రులు, చుట్టాలు, ఆంటీలు, అంకుళ్లు అందరికీ ఓ విఙ్ఞప్తి. ఇలాంటి మాటలు చెప్పి ఆడపిల్లల్ని వెనక్కిలాగకండి. చిన్నతనంలో ఇటువంటి మాటలు విన్నపుడు నిజంగానే వాళ్లు చెప్పినట్లు జరుగుతుందా అనే చిన్న సందేహం ఉండేది. తెల్లగా ఉంటేనే అందం.. అందం ఉంటేనే పెళ్లి అనే మాటలు చెప్పే సంస్కృతి పోవాలి. అమ్మాయిలకు ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి అని విఙ్ఞప్తి చేసింది.

When Sania Mirza was told to stop playing tennis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles