Home తాజా వార్తలు హెల్మెట్ లేకుండానే వెళ్తున్నాం.. పోలీసులు ఎక్కడ? (వైరల్)

హెల్మెట్ లేకుండానే వెళ్తున్నాం.. పోలీసులు ఎక్కడ? (వైరల్)

Ram-Gopal-Varmaహైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శనివారం నగరంలో ఓ సాధారణ వ్యక్తిలా వెళ్లి రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సిన్మా చూశారు. తన శిష్యులతో కలిసి రాయల్ ఎన్ ఫీల్డ్ పై మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ కు వర్మ వెళ్లారు. ఈ సందర్భంగా బండి మీద ఉన్న ముగ్గురిలో ఎవరికీ హెల్మెట్ లేదు, పైగా ట్రిపుల్ రైడింగ్ చేశారు. దీనిపై వర్మ స్పందించాడు.

హెల్మెట్ లేకుండానే వెళుతున్నాం, ఇంతకీ పోలీసులు ఎక్కడ? బహుశా వాళ్లు కూడా థియేటర్లో ఇస్మార్ట్ శంకర్ సిన్మా చూస్తున్నారనుకుంటా’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ ప్రయాణించిన బైక్ బద్దె దిలీప్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దీంతో బండి యజమానికి పోలీసులు చలాన్ పంపారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడంతో పోలీసులు రూ.1300 జరిమానా విధించారు.

Where is Police I think they are watching ISmart Shankar