Saturday, April 20, 2024

బండి మిత్రుడి బండే

- Advertisement -
- Advertisement -
Whip Balka Suman Fires on Bandi Sanjay
ఈటల శవ రాజకీయాలు, అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్‌కు గుణపాఠం తప్పదు
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజేందర్ మరణానికి బిజెపి నేతలే కారణం
బండి సంజయ్‌తో కారు యజమాని దిగిన ఫోటోను ప్రదర్శిస్తున్న బాల్కసుమన్, బండి సంజయ్‌తో కారు డ్రైవర్
ఆ వాహనం కమలందే… డ్రైవర్ ఆ పార్టీకి చెందిన వాడే
బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి
బండి సంజయ్ ఆధ్వర్యంలో దాడులకు పన్నాగం
గ్రామాల్లోకి దిగిన బిజెపి గుండాలు
దీనిపై డిజిపి వెంటనే దృష్టి సారించాలి : బాల్కసుమన్

మన తెలంగాణ/ హుజూరాబాద్: రెండు రోజుల క్రితం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నాగుర్ల రాజేందర్ చావుకు ముమ్మాటికి బిజెపి నేతలే ప్రధాన కారణమని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యుడు బాల్కసుమన్ ఆరోపించారు. ఆ కారు యజమాని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంచి మిత్రుడన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మంగళవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమక్షంలో బాల్క సుమన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బండికి మిత్రుడైన వినోద్‌కు చెందిన కారు వల్ల వ్యక్తి చనిపోతే దానికి తాము కారణమని ప్రజలకు తప్పు దోవ పట్టించేందుకు బిజెపి నేతలు యత్నించడం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్‌లో ఘోరంగా ఓడిపోతామని తెలిసే…బిజెపి నాయకులు శవ రాజకీయాలకు తెరలేపారని తీవ్ర స్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు నేతలు బట్ట కాల్చి…ఆ నెపాన్ని టిఆర్‌ఎస్‌పై వేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అబద్ధపు పునాదులపై బతుకుతూ.. ఓట్ల కోసం కమలం నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇందుకు నిరసనగా బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్‌తో పాటు ఆ పార్టీ నేతలు వివేక్ , ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు వందల మంది ఘటనా స్థలంలో ఆందోళన చేయడం సిగ్గుచేని విమర్శించారు. వారి వ్యవహారం చూస్తుంటే దొంగే దొంగ .. అన్నట్లుగా ఉందని, విష సంస్కృతితో కాషాయ దళమంతా నిండిపోయిందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఘటనకు బాధ్యులైన ఆటోడ్రైవర్ కు టుంబానికి ఈటల , బండి సంజయ్, వివేక్ ముగ్గురు రూ .50 లక్షలు చొప్పున ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న బిజెపి నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇది తెలుసుకోకుండా ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్ మీద బురద జల్లుతున్నారన్నారని మండిపడ్డారు. నెత్తురు రచి మరిగిన వ్యక్తులు మీరు (బిజెపి)ని, నెత్తురు జార పోసిన చరిత్ర మాద (టిఆర్‌ఎస్)ని ఆయన అన్నారు.

హుజురాబాద్‌లో ఎలాగైనా గెలువాలన్న లక్షంతో బిజెపి ఆధ్వర్యంలో కుట్రలు, కుతంత్రాలు జరిగే అవకాశం ఉందని బాల్కసుమన్ ఆరోపించారు. దుబ్బాకలో మాదరిగానే వాళ్ళకు వాళ్ళే దాడులు చేసుకుని సానుభూతి పునాదుల మీద నాలుగు ఓట్లు పొందాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంపై డిజిపి పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే చాలా మంది బిజెపి గుండాలు, కిరాయి హంతకులు గ్రామాల్లో దిగారనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించి పూర్తిగా అతిక్రమిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల పరిశీలకులు సైతం నిఘా పెట్టాలని ఆయన కోరారు. కిరాయి మూకలు, హంతకులు ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దిగారని బాల్కసుమన్ వ్యా ఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈటల చుట్టూ ఓటమి గ్యాంగ్ చేరి కుట్రలకు వ్యూహం పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. డీజిల్ ధరలపై ఈటల రాజేందర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని బాల్కసుమన్ మండిపడ్డా రు. ప్రజల్లో సానుభూతి కోసం ఈటల రాజేందర్ బరితెగిస్తున్నాజన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తిని ఓట్ల కోసం కోట్ల రూపాయల్లో ఖర్చు పె డుతున్నాడన్నారు. – మనుషులను చంపడం బిజెపి సంస్కృతి అని, రుచి మరిగిన చరిత్ర ఆ పార్టీ నేతలదని బాల్కసుమార్ వ్యాఖ్యానించారు. యుపి లఖీంపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు కారుతో రైతుల్ని తొక్కి చంపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఈటలవి పచ్చి అబద్ధాలు

మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గ్యాస్ ధర విష యంలో పచ్చి అబద్దాలు చెబుతున్నారని సుమన్ మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే స్టేట్ టాక్స్ రూ .291వసూలు చేస్తున్నారడం ఆయన ఇంగితానికే వదిలివేస్తున్నామన్నారు. కేవలం గ్యాస్ మీద 5 శాతం జిఎస్‌టి కేంద్రం వసూలు చేస్తోందన్నారు. ఇది కూడాతెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News