Friday, April 19, 2024

కోవోవాక్స్‌కు డబ్లుహెచ్‌ఓ ఆమోదం

- Advertisement -
- Advertisement -
WHO approval for Kovovax
టీకా అత్యవసర వినియోగానికి అనుమతి

జెనీవా: భారత్‌నుంచి ఉత్పత్తి అవుతున్న మరో కొవిడ్ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ)ఆమోదం లభించింది. పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్‌కు డబ్లుహెచ్‌ఓ ఆమోదం తెలిపింది, కాకపోతే.. ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని డబ్లుహెచ్‌ఓ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సమర్థత, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితుల్లో దీన్ని తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా వాడుతున్నారు.

కోవోవాక్స్‌ను అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. దీన్ని కూడా రెండు డోసులు వేసుకోవలసి ఉంటుంది. అంతేకాదు 2నుంచి 8 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో ఫ్రిజ్‌లలో కూడా దీన్ని నిల్వ చేయవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు చేస్తున్న కృషికి ఇది ఎంతో తోడ్పాటునందిస్తుందని డబ్లుహెచ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కోవోవాక్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలపడంపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సిఇఓ అదర్ పూనావాలా ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News