Thursday, April 25, 2024

ఎవరి ధీమా వారిదే!

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్సీ ఓట్లపై ఎవ్వరి అంచనాలు వారివే
కూడికలు, తీసివేతల లేక్కలతో నేతల కుస్తీలు
తొలి ప్రాధాన్యత ఓట్లపైనే ‘పల్లా’ ఆశలు
రెండో ప్రాధాన్యతపై గురిపెట్టుకున్న ప్రొఫెసర్ సార్
రేపు నల్లగొండలో ఓట్ల లేక్కింపు

Who are win in MLC Elections in Telangana

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై ఎవ్వరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదివారం పోలీంగ్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో పోటీ చేసిన ప్రధాన పార్టీలు ఎవ్వరి అంచనాలో వారు మునిగి తెలారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలీంగ్ శాతం నమోదు కావడంతో ఎవ్వరి లేక్కలు వారు వేసుకుంటూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్‌ల మధ్య గెలుపు నీదా? నాదా ?అనే చందంగా పోటీ నెలకొన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామల మధ్య జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఎన్నికలను ఆ పార్టీ సవాల్‌గా తీసుకొని పనిచేసింది. సాక్షాతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర టిఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ ఈ ఎన్నికలపై పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు నడిపించారు. దీంతో 12 జిల్లాల పరిధిలోని గులాబీ శ్రేణులు అభ్యర్థ్ధి పల్లా గెలుపు కోసం అహర్నశలు శ్రమించారు. మంత్రుల నుంచి సర్పంచ్ వరకు అన్ని స్థ్దాయిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పట్టభద్రుల ఓటు నమోదు మొదలుకొని ఓటర్లను పోలీంగ్ కేంద్రాల వద్దకు తీసుకవచ్చేందుకు వరకు చెమటోడ్చి కష్టపడ్డారు. ఫలితంగా ఆదివారం ప్రశాంతంగా పోలీంగ్ జరగడమే కాకుండా ఘన నీయంగా పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికతో పోల్చుకుంటే దాదాపు డబుల్ పోలింగ్ శాతం నమోదు అయ్యింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 76.41శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

పోలైన ఓట్ల లేక్కలు ముందుపెట్టుకొని కూడికలు తీసివేతల లేక్కలు వేసుకుంటున్నారు. ఆ జిల్లాలో ఇలా జరిగింది ఈ జిల్లాలలో ఇలా నమోదు అయ్యింది అంటూ కాకిలేక్కలు వేసుకుంటున్నారు. అయితే అధికంగా పోలీంగ్ శాతం నమోదు కావడం టిఆర్‌ఎస్ పార్టీకి లాభం చేకుర్చుతుందా? నష్టం చేకుర్చుతుందా? అనే విషయంపై కూడా భిన్నవాధనాలు విన్పిస్తున్నాయి. మొత్తం ఓట్లు 5లక్షల5వేల565 ఓట్లలో 385117 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో యాభైశాతం కంటే ఎక్కువ ఓట్లు అంటే దాదాపు లక్షా93వేల ఓట్లు ఎవ్వరయితే సంపాదించుకుంటారో వారు గెలిచినట్లుగా ప్రకటిస్తారు. అయితే టిఆర్‌ఎస్ నేతల అంచనా ప్రకారం భారీ పోలీంగ్ నమోదైనందునా టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి సులభంగా బైట పడుతారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పట్టభద్రల ఓట్లను టిఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించి దగ్గర ఉండిఅన్‌లైన్ చేయించారు. అంతేగాక వారందరిని పోలీంగ్ రోజు బూత్‌ల వద్దకు తీసుకరాగలిగారు.

వీటికి తోడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాల వల్ల తమ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు నల్లెరుమీద నడకేనని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌కు బలంగా ఉన్న ప్రాంతాల్లో తొలి ప్రాధాన్యత ఓట్లు పల్లాకే పడినట్లు ఓటింగ్ సరళీని బట్టి తెలుస్తోంది ప్రధానంగా సత్తుపల్లిలో టిఆర్‌ఎస్‌కు సానుకులంగా పడ్డాయి. అంతేగాక ఈ ప్రాంతంలోనే భారీ పోలీంగ్ నమోదు అయ్యింది. జిల్లాలోనే పెనుబల్లిలో అత్యధిక పోలీంగ్ శాతం నమోదు అయ్యింది. ఇక పట్టణాల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల్లో మెజార్టీ వర్గాలు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. వీరంతా తొలి ప్రాధాన్యత ఓట్లను పల్లాకే వేసి రెండో ప్రాధాన్యత ఓట్లను ప్రొఫెసర్ కోదండరామ్‌వైపు మొగ్గు చూపినట్లు పోలింగ్ సరళీని బట్టి తెలుస్తోంది. ప్రభుత్వంపై లేదా అభ్యర్థ్దిపై వ్యతిరేకంగా ఉన్న ఓట్లు గంపా గుత్తాగా ఒకరికే కాకుండా చీలిపోయి పలువురికి దాఖలు అయినందునా అదికూడా తమకు కలిసి వస్తుందని టిఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.

అయితే ఏజెన్సి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ప్రొఫెసర్‌కు తొలి ప్రాధాన్యత ఓట్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇల్లెందు నియోజకవర్గంలో న్యూడెమోక్రసి పట్టు ఉన్న గ్రామాల్లో పట్టభధ్రులంతా ప్రొఫెసర్‌కు అనుకులంగానే ఓట్లు వేశారు. ప్రొఫెసర్‌కు మద్దతు ఇచ్చిన టిడిపి శ్రేణుల ఓట్లు మాత్రం గంపాగుత్తాగా ఫ్రొఫెసర్‌కు అనుకూలంగా పడలేదు. ఇందులో చాలా మంది అధికార పార్టీకి అనుకూలంగా వేశారు. వామపక్షాలకు చెందిన ఓటర్లు తొలి ప్రాధాన్యతగాతమ పార్టీ అభ్యర్థ్ధికి వేసి రెండో ప్రాధాన్యతగా ప్రొఫెసర్‌ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

ఇక బిజెపి కార్యకర్తలు, అభిమానులతోపాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తొలి ప్రాదాన్యత ఓట్లను తమ పార్టీ అభ్యర్థ్ధులకు వేసుకొని రెండో ప్రాధాన్యతగా ప్రొఫెసర్ సార్‌కు టిక్ పెట్టారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లంబాడి తండాల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థ్ధి రాములు నాయక్ తొలి ప్రాధాన్యతగా భారీగానే ఓట్లు పడినట్లు తెలుస్తోంది. వీరంతా రెండో ప్రాధాన్యతగా కోదండరామ్‌కు అనుకూలంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి తొలి ప్రాధాన్యత ఓట్లు తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్, రాణి రుద్రమాదేవిలకు పడినప్పటికి రెండో ప్రాధాన్యతగా టిజెఎస్ అభ్యర్థ్ధివైపు మళ్ళీనట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరంగల్ జిల్లాలో పల్లా, కోదండరామ్, ప్రేమెందర్‌రెడ్డిలు ముగ్గురు భారీగా ఓట్లను పంచుకున్నారు.

మహబుబ్ బాద్, వరంగల్ రూరల్ జిల్లాలో మెజార్టీ ఓటర్లు పల్లా వైపు మొగ్గు చూపారు. యాద్రాద్రి భువనగిరి జిల్లాలో రెండో ప్రాధాన్యత ఓట్లుగా యువ తెలంగాణ అభ్యర్థ్ది రాణిరుద్రమారెడ్డికి నమోదు అయ్యాయి. దీంతో అక్కడ కోదండరామ్‌కు అక్కడ కొంత నష్టం జరిగింది. నల్లగొండ జిల్లాలో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థ్ధి చెరుకు సుధాకర్ కొంత ప్రభావం చూపించారు. నల్లగొండ జిల్లాలో తొలి ప్రాధాన్యతగా పల్లా వైపు మొగ్గినప్పటికి రెండో ప్రాధాన్యతగా అంటూ చెరుకు ఇటూ రాణిరుద్రమాదేవి, తీన్మార్ మల్లన్న మళ్ళీంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈసారి తొలి ప్రాధాన్యతపైనే గురి పెట్టారు. ఆ దిశగానే విసృత్తంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు అదే అదేశాలను పంపించారు. అసలు రెండో ప్రాధాన్యత ఓటు వేయకుండానే రావాలనే సంకేతాలు అక్కడక్కడ వెళ్ళాయి.
భారీ పోలింగ్ నమోదు అయినందునా ఈ సారి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే పల్లా పట్టు సాధిస్తారనే ధీమాను గులాబీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు సాధించని రికార్డును పల్లా తిరగరాసినట్లు అవుతుంది. ఈనెల17న ఓట్ల లేక్కింపు నల్లగొండ పట్టణంలో జరగనుంది. 12 జిల్లాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లో ఆదివారం రాత్రి కల్లా నల్లగొండకు చేరుకున్నాయి. బుధవారం ఓట్ల లేక్కింపుతో అసలు విజేత ఎవ్వరో తేలిపోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News