Home Default ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?

  • నేటి బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రకటించే అవకాశం, దక్షిణాదివైపే మోడీ మొగ్గు

who-hi

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అధికార బిజెపి అభ్యర్థి ఎంపికపై తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆదివారం మధ్యాహ్నం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నట్లు సమాచా రం. ఆదివారం ఉ॥ 11 గం॥లకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అనంతకుమార్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బిజెపి పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనున్నది, ఈ సమావేశానికి ముందే పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ఉండడం, మంగళవారం ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ కా నుండడంతో ఆదివారమే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి కానున్నట్లు తెలుస్తున్నది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి బిజెపి ఇప్పటి కే కసరత్తు పూర్తి చేసింది. గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆర్‌ఎస్‌ఎస్ నేత లు డా.కృష్ణగోపాల్, భయ్యాజీ జోషీలతో ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ పార్టీ కార్యాలయంలో దాదాపు గంటన్నర సేపు సమావేశమై చర్చించారు. ఆదివారం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ప్రకటించాల్సి రావడంతో దాన్ని దృష్టి లో ఉంచుకొని ఈ సమావేశం జరిగింది. మొదట ఆర్‌ఎస్‌ఎస్-, బిజెపిల మధ్య ఏకాభిప్రాయం సా ధ్యమైతే, అప్పుడు ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీల నేతలతో అభ్యర్థిత్వంపై చర్చించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసిన మోడీ టీం ఇప్పుడు ఉప రాష్ట్రపతి విషయంలోనూ అదే పం థాను అనుసరించనుంది. దళితుడిని రాష్ట్రపతిని చేసిన మోడీ టీం ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై దృష్టి సారించిందని చెబుతున్నారు. అగ్రవర్ణాలకు గానీ, ముస్లింలకు గానీ ఉప రాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజ్యసభలో అధికార పార్టీకి మెజారిటీ లేనందున ఆ సభను నడపడం కత్తిమీద సాము లాంటిది కాబట్టి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో అనుభవంతో పాటు, విధేయతో పాటు మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.అందులో మొదటిది బీజేపి దాని అనుబంధ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో అనుబంధం ఉన్న వ్యక్తిని, రెండోది ఎటువంటి వివాదాలకు తావులేకుండా రాజ్యసభను నడపగల దక్షత, మూడవది రాజ్యసభలో కీలక బిల్లులు చర్చకు వచ్చిన సందర్భంగా అధికారపార్టీకి అండగా ఉండే వ్యక్తిని ఎంపిక చేయాలని మోడీ, అమిత్ షా లు నిర్ణయించినట్లు తెలుస్తుంది.  అయితే ఇటీవల దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా విన్పిస్తున్నాయి. వచ్చే ఏడాది కర్ణాటక ఎన్నికలు కూడా జరగనున్నాయి. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతిగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దక్షిణాదివారిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపైన చర్చలు జరుగుతున్నట్లు సమచారం. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి నేతను ఎంపిక చేస్తే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ నేతలకు కాదని ఈ పదవి నరసింహన్ కు ఇచ్చే అవకాశాలు కూడా తక్కువగానే కన్పిస్తున్నాయి. అయితే మోడీ మాత్రం దక్షిణాదివారికి అన్యాయం జరగుతుందన్న అపవాదు నుంచి బయటపడేందుకే దక్షిణాది వారికే ఉప రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని డిసైడ్ అయినట్లు ఢిల్లీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. కేరళ గవర్నర్ సదాశివన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి పదవి ఉత్తరాది నుండి పెద్ద రాష్ట్రమైనా యూపీ నుంచి ఇస్తున్నారు కాబట్టి, ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాది వారికి కేటాయిస్తారని ఆశావాహులు ధీమాగా ఉన్నప్పటికీ, ఎవ్వరూ ఊహించని వారిని ఎంపిక చేసి, షాక్ ఇవ్వడంలో దిట్ట అయిన మోడీ ఏనిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, రెండోసారి ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న హమీద్ అన్సారీ పదవీ కాలం వచ్చేనెల 10న ముగుస్తుంది. అన్సారీ 2007లో తొలిసారి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తరవాత 2012లోనూ విజయం సాధించారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 5న జరగనుంది. జూలై 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తం మీద మోడీ మరో షాకింగ్ న్యూస్ ఆదివారం ఇవ్వనున్నారన్నమాట.