Home కరీంనగర్ పంటలకు మద్దతు ధర కల్పించాం

పంటలకు మద్దతు ధర కల్పించాం

Why not ration cards are printed

కొరత లేకుండా ఎరువులను అందిస్తున్నాం
రేషన్ కార్డులను ఎందుకు ముద్రించడం లేదు
మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు
సర్పంచులకే ఇన్‌చార్జి బాధ్యత అప్పగించాలి
బిజెపి ఫ్లోర్ లీడర్ కిషన్‌రెడ్డ

మనతెలంగాణ/కరీంనగర్‌: దేశంలో ఎన్నడు లేని విధంగా పంటలకు మద్దతు ధర కల్పించామని బిజెపి ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని నిర్ల క్షం చేస్తుందన్నారు.రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అందిస్తు న్నామన్నారు. న్యాణమైన విద్యుత్‌ను కూడా అందిస్తూ కేంద్రం అనేక పథకా లను కూడా ప్రవేశపెట్టి అర్హులకు లబ్ధిచేరుకురుస్తుందన్నారు. రేషన్ బియ్యం లో కేంద్రం నుంచి కెజికి రూ.20లు అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు అందిస్తుందన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలేదన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణలో రేషన్ కార్డులను ఎందుకు ముద్రించడం లేదని ప్రశ్నించారు. రేషన్ కార్డులు అందించినట్లయితే వాటిపైన కేంద్ర ప్రభుత్వం లోగో వేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షం చేస్తుందన్నారు. మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయని… అది సిఎం కెసిఆర్ కుటుంబమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని అమలు చేసి పంటల బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో అమ లు పర్చాలన్నారు. జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎన్నికలు జరపకపోవడం వలన పంచాయతీలకు ప్రత్యేక పాలనను మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అని ప్రజలకు సమాధానం చెప్పలే దాన్నరు.

రాష్ట్ర శాసన సభ జరిగేంత వరకు పంచాయతీ రాజ్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఇది పంచాయతీ రాజ్ ఎన్ని కలకు విరుద్ధమని మండిపడ్డారు.రాష్ట్రంలో కేంద్ర పథకాలలో అమలులో సిఎం కెసిఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నార ని అన్నారు.విభజన హామీలు ఏమి చేయాలో ప్రభుత్వం చెబితే మేము చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో బిజెపిది కీలక పాత్ర అని బి జెపి లేకపోతే పార్లమెంట్ తెలంగాణ బిల్లు అమోదం అయ్యేది కాదన్నారు. తెలంగాణలోని అన్ని పథకాలకు బిజెపి నిధులు అందిస్తుందన్నారు. నేరెళ్ల దళితులపై దాడులు జరిగి ఏడాది గడిచినా అధికారుల పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి, కిసాన్‌మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. సుగుణాకార్‌రావు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్,జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి,నాయకులు కోమల అంజనేయులు, కొరివి వేణుగోపా ల్, గాజుల స్వప్న, హరికుమార్‌గౌడ్, సుజాత రెడ్డి, కచ్చు రవి, బేతి మహేందర్‌రెడ్డి, దుబాల శ్రీనివాస్,బోయినిపల్లి ప్రవీణ్‌రావు, కటకం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.