Home తాజా వార్తలు గ్రేటర్‌లో ప్రచారంలో ప్రతిపక్షాలు ఎందుకు విఫలమయ్యాయి

గ్రేటర్‌లో ప్రచారంలో ప్రతిపక్షాలు ఎందుకు విఫలమయ్యాయి

parties

ఆరా సర్వే ప్రకారం
మన తెలంగాణ ప్రత్యేకం

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ మినహా ఇతర పార్టీలు విఫలమయ్యాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఓటుకు నోటు స్కామ్ టిడిపికి ప్రతికూలంగా టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారింది. టిడిపి, బిజెపి. కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ప్రచారం ప్రారంభించకపోవడం, నామినేషన్ల గడువు ముగిసే వరకు అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం లాంటి విషయాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా పరిణమించాయి. గ్రేటర్ ఎన్నికలలో ప్రచారంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిఆర్‌ఎస్‌నుగాని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కాని విమర్శించపోవడంతో టిడిపి అనుకూల ఓటర్లలో, ఆంధ్ర సెటిలర్లలో టిడిపి పట్ల అవిశ్వాసం ఏర్పడింది. తెలుగు దేశం పార్టీకి సాంప్రదాయక ఓటు బ్యాంకు అయిన కమ్మ, క్షత్రియ, వడ్డర, పద్మశాలీ, గౌడ, యాదవ, మాదిగ సామాజికవర్గాల్లో టిఆర్‌ఎస్ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించడంలో సఫలమైంది. బిజెపి, టిడిపితో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగినప్పటికి రెండు పార్టీల మధ్య సరైన సఖ్యత లేకపోవడం బిజెపి ప్రజాహర్షక నేతలతో ప్రచారం చేయించకపోవడం చివరి వరకు అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం, రెబల్స్‌ను నియంత్రించలేకపోవడం బిజెపి వెనకబాటుకు కారణాలయ్యాయి. బిజెపికి సాంప్రదాయక ఓటు బ్యాంకైన బ్రాహ్మణ, వైశ్వ, మార్వాడీ, లోధి, పద్మశాలీ, సామాజిక వర్గాల్లో కూడా సరైన ఓటు సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వెనుకబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. 2009 ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో 52 స్థానాలను సాధించి మేయర్ పీఠాన్ని అధిష్టించిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి మజ్లిస్ పార్టీతో ఎన్నికల సర్దుబాటు లేకపోవడం, సరైన ప్రచారం చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ స్థితికి కారణలయ్యాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒక్కడై పోరాడినా స్థానిక నగర నాయకులు సహకారం లేకపోవడం, మాజీ మంత్రులెవరూ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకపోవడంతో, కేవలం మూడు నుంచి ఏడు స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం కానుంది. పాతబస్తీలో బలంగా ఉన్న ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలపడం, పార్టీ పాత ఓటు బ్యాంకును పునరుద్ధరించుకున్నప్పటికీ అవి సీట్ల రూపంలోకి మారలేదు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేసినప్పటికీ గతం కంటే సీట్లు తగ్గినవి. పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ మైనార్టి అభ్యర్థులను రంగంలోకి దింపిన కారణంగా ఓట్లలో చీలి వచ్చి పరోక్షంగా తెలుగుదేశం, బిజెపి కూటమి లాభపడి వారికి కొన్ని వార్డులు గెలుచుకోడానికి అవకాశం ఏర్పడినది. పాత బస్తీకి బయట ప్రాంతమైన రెహ్మత్ నగర్, బోరబండ, భోలక్‌పూర్, అల్లాపూర్. ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో మజ్లీస్ ప్రభావం అధికంగా ఉన్నట్లు సమాచారం.

GHMC-Poll-1

GHMC-Poll-2