Tuesday, March 21, 2023

జాగృతి ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు

- Advertisement -

kavi

మన తెలంగాణ/మోత్కూరు : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడమే తెలంగాణ జాగృతి ద్యేయం అని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాద్యక్షుడు మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. సోమవారం మోత్కూరు మండల కేంద్రంలో మేడె రాజీవ్ సాగర్ సమక్షంలో సుమారు 100మంది యువకులు తెలంగాణ జాగృతిలో చేరారు. రాజీవ్ సాగర్ యువకులు జాగృతి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సహావేశంలో రాజీవ్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో విసృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి 17దేశాలలో విస్తరించిందని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కంచర్ల క్రాంతికుమార్ రెడ్డి ఆద్వర్యంలో 100మంది యువకులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈకార్యక్రమంలో తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ కోదారి శ్రీనువాస్,సూర్యాపేట జిల్లా కన్వీనర్ రంగినేని ఉపేందర్‌రావు, యువజన విభాగం కన్వీనర్ గఫార్‌ఖాన్,కోకన్వీనర్ సతీష్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ఎస్.కె.మౌలానా,మండల కన్వీనర్ బెజగం రమేష్,మహిళా విభాగం మండల కన్వీనర్ తంగెల్లపల్లి కమల,విద్యార్ది కన్వీనర్ సకినాల వివేక్, నాయకులు రాజు, ప్రకాష్, శ్రీకాంత్, భాను, మధు, నరేష్, సంపత్, రాఖేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News