Home తాజా వార్తలు ప్రేమ పెళ్లి…. కట్నం కోసం వేధింపులు… ఆత్మహత్య…

ప్రేమ పెళ్లి…. కట్నం కోసం వేధింపులు… ఆత్మహత్య…

Wife commit suicide with dowry

నల్లగొండ: ప్రేమించాడు… పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల తరువాత కట్నం కావాలని వేధించడంతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వావిల్ కోల్ గ్రామంలో చిన్నయ్య(26), శ్రీలత(24) గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను శ్రీలత కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో పోలీసుల సమక్షంలో శ్రీలత-చిన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అదే గ్రామంలో చిన్నయ్య కిరాణ దుకాణం నడిపిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి శ్రీలతను కట్నం తీసుకరావాలని చిన్నయ్య, అతడి తల్లి వేధిస్తుండడంతో ఏమీ చేయాలో ఆమెకు తోచలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి వెళ్లలేక గ్రామ శివారులో ఓ బావి దగ్గర చెట్టుకు శ్రీలత ఉరేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.