Home వరంగల్ కట్టుకున్నోడి కర్కషం

కట్టుకున్నోడి కర్కషం

Wife complaints against Husband in Police Station

మన తెలంగాణ/ వరంగల్ క్రైం: ఇది సభ్యసమాజం సిగ్గుపడే అంశం. కట్టుకున్నోడే మానాన్ని అమ్ముకోవాలని ఒత్తడి తేస్తున్న దుస్థితి. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, మానాన్ని అమ్ముకోలేక ఓ మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు సిద్దపడింది. కానీ ఆ మహిళకు ఎలాంటి ఆసరా దొరకడం లేదు. భరోసానిచ్చి అండగా నిలవాల్సిన సమాజం పట్టించుకోవడం లేదు. భర్తతో నిత్యపోరును భరించలేని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో సదరు బాధితురాలు సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరెట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేసి అండగా నిలువాలని, రక్షణ కల్పించాలని భోరున విలపించింది. జన్మనిచ్చిన ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చిన బాధితురాలు గోడు విన్న కలెక్టరెట్ అధికారులు బాధితురాలిని వన్ స్టాఫ్ కౌన్సిలింగ్ సెంటర్‌కి తరలించారు. ఈ సందర్భంగా బాధితురాలిని కదిలించిన మీడియాతో తమ గోడును వెళ్ళబోసుకుందీ వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం సోడషపల్లి గ్రామానికి చెందిన జింక విజయ.
వివరాలు ఆమె మాటల్లోనే…
గత ఐదు ఏండ్ల కింద స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన జింక సురేష్‌తో తనకు వివాహమైందని ఇద్దరుపిల్లలు ఉ న్నారని తెలిపింది. అయితే తన భర్త సురేష్ కొంత కాలంగా ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టు కోవాలని ఒత్తిడి తెస్తూ వ్యభి చారం వృత్తిగా ఎంచు కోవా లని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపింది. కొంత మంది తన స్నేహితుల ఫొటోలు చూపడం వారిని ఇంటి వరకు తీసుకొచ్చి పరి చయం చేసివారితో శారీర కంగా సంబంధాలు పెట్టుకో వాలని ఒత్తిడి తెస్తున్నాడని తెలిపింది. గత కొంత కాలం గా భర్త వేధింపులు భరించలేక భర్తకు దూరంగా ఉంటున్నా కూడా మద్యం తాగి ఇంటికొచ్చి గొడవలకు దిగడం పరిపాటిగా మారిందన్నారు. ఇట్టి విషయంలో గతంలో ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో, మహిళా పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశానని కాని ఎవరూ పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికీ తన భర్త వేధింపులు భరిం చలేక పోతున్నానని, చెప్పినట్లు వినకపోతే తనను తన తోబుట్టువుని చంపుతానని బెధిరి స్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సోమవారం కలెక్టరెట్ గ్రీవెన్స్‌లో తనకు న్యా యం చేసి ఆదుకోవాలని విన్నవించింది. అయితే తనకు న్యాయం చేయాలని గతం లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల తాలూకు ప్రతాలను, తన భర్తే వ్యభిచారం చేయా లని చూపిన ఇతరుల ఫొటోలను అధికారులకు చూపింది. దీంతో కలెక్టరెట్ అధికా రులు స్పందించారు. నగరంలోని ఆశ్రమానికి అప్పగించారు. ఈ ఘటనపై పోలీసు లు, అధికారులు సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేయాలని, మహిళా సంఘా లు అండగా నిలువాలని బాధితురాలు కోరుతోంది. ఏదిఏమైనప్పటికీ సదరు మహిళా ఎదుర్కొంటున్న సమస్యను ఇరుపక్షాల నుంచి ఆలోచించాల్సిన అవసరముందని, మనుషుల మనస్తత్వాలకు సంబంధించిన మానసిక సమస్య కాబట్టి  ప్రత్యేక కోణంలో అధికార యంత్రాంగం విచారించాల్సిన అవసరముందనేది గమనార్హం.