Home తాజా వార్తలు అత్యాశతో భర్త హత్య

అత్యాశతో భర్త హత్య

wife killed her husband

బీమాసొమ్ము, ఉద్యోగం వస్తాయని భర్తను చంపించిన భార్య
రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో దారుణ ఘటన 

మన తెలంగాణ/ వనస్థలిపురం: తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు, భర్త చనిపోతే ఉద్యోగంతోపాటు ఎల్‌ఐసి డబ్బుల లబ్దికోసం భర్తను హత్య చేయించిన ఘటన వనస్థలిపురంలో జరిగింది. సోమవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎసిపి గాంధీ నారాయణ వివరాలను వెల్లడించా రు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడ గ్రామంలోని భవానీనగర్‌కు చెందిన కేస్యానాయక్ (43) పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యో గం నిర్వహిస్తున్నారు. కాగా సుమారు 20 సంవత్సరాల క్రితం కేస్యానాయక్‌కు కేతావత్ పద్మతో వివా హం జరిగింది. అనంతరం వారి మధ్య మనస్పర్థ లు రావడంతో కోర్టులో కేసు నడుస్తున్నది. ఇది ఇలా ఉండగా కేస్యానాయక్ శైలజతో రెండవ వివా హం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు, ఒక పాపఉన్నారు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పద్మ తనను కాదని రెండవ వివాహం చేసుకున్న కేస్యాను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నది. అందులో భాగంగానే కేస్యానాయక్ దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేసిన సబావత్ వినోద్‌తో ఒప్పంద కుదుర్చుకున్నది. తన భర్తను చంపితే  వచ్చే ఎల్‌ఐసి డబ్బుల నుండి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పగా దానికి వినోద్ అంగీకరించాడు.

అడ్వాన్స్‌గా వినోద్‌కు 15వేల రూపాయలను ఇచ్చి మిగిలిన డబ్బులు పని అయిన తర్వాత ఇస్తానని చెప్పింది. పథకం ప్రకారం ఈనెల 1న రాత్రి 8గంటలకు కేస్యానాయక్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా సబావత్ వినోద్ అతనికి ఫోన్ చేశాడు. తర్వాత ఎల్బీనగర్‌లో కలుసుకుని జైలో వావానం(టిఎస్ 07 యుఇ2221)లో గుర్రంగూడ దగ్గర ఉన్న భవానీ బార్ అండ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కేస్యానాయక్‌కు మోతాదుకు మించి మద్యం తాగిపించాడు. ఆ తర్వాత కేస్యానాయక్‌ను అదే వాహనంలో ఎక్కించుకుని డ్రైవర్ ప్రక్క సీట్లో కూర్చోండబెట్టాడు. కారును గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు కొద్దిగా ముందుకు తీసుకెళ్లి  గొంతు నులిమి చంపేశాడు. కాగా ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదం జరిగినట్లు సృష్టించాలని భావించిన వినోద్ అక్కడ నుండి ఇంజాపూర్ కమాన్ దగ్గర గల హైటెన్షన్ విద్యుత్ స్తంభానికి కారును ఎడమవైపు ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడే ఉన్న వినోద్, పద్మలపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు పంపించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా చాకచక్యంగా కేసును ఛేదించినందుకు వనస్థలిపురం సిఐ పి. నరేందర్, ఎసై సుధాకర్‌రావు, సిబ్బందిని ఏసిపి గాంధీనారాయణ అభినందించారు.