Home తాజా వార్తలు ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Wife killed her husband in tandur

 

మనతెలంగాణ/తాండూర్‌: వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసిన సంఘటన తాండూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… వనపర్తి ప్రాంతానికి చెందిన అంజప్ప (35) గత కొంత కాలంగా తాండూర్ పట్టణంలో హమాలీగా పని చేస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన భార్య సుజాతతో కలిసి కాపురం పెట్టినా తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త చేష్టలు భరించలేని సుజాత తరచూ తన సోదరుడు కోమార్ శ్రీనివాస్ ముందు ఆవేదన వ్యక్తం చేసేది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం రాముగౌడ్ అనే వ్యక్తితో సుజాతకు పరిచయం ఏర్పడటంతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. బావ అంజప్ప నుంచి తన అక్కను కాపాడాలని రాముగౌడ్‌ను కోమార్ శ్రీనివాస్ కోరాడు.

చివరికి అంజప్పను హతమార్చాలని సుజాత, రాము, శ్రీనివాస్ పథకం రచించారు. ఈ నెల 10న మద్యం మత్తులో వచ్చిన అంజప్పను ముగ్గురు కలిసి గొంతు నులిమి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కందనెల్లి వాగులో వేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ప్రాథమిక నివేదిక ఆధారంగా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానించారు. మృతుడు అంజప్ప భార్య సుజాతను విచారించగా నేరాన్ని అంగీకరించింది. దీంతో సుజాతను రిమాండ్‌కు తరలించినట్లు తాండూర్‌రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Wife killed her husband in tandur