Home తాజా వార్తలు ఇద్దరు ప్రియులతో భర్తను చంపి….

ఇద్దరు ప్రియులతో భర్తను చంపి….

 

నిర్మల్: నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన నాలుగు నెలల తరువాత వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లావణ్య మొదటి భర్తను విడిపించుకొని అంకాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్‌ను రెండో వివాహం చేసుకుంది. దౌలాజీ, గంగాధర్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. ఈ దంపతుల మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి. లావణ్య తన ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను హత్యా చేయాలని ప్లాన్ వేసింది. ఉదయ్‌ను దౌలాజీ, గంగాధర్ మద్యం సేవిందామని నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామ శివారులోని గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. ఉదయ్ ఎక్కువగా మద్యం తీసుకొని స్పృహ తప్పిపడిపోయాడు. అనంతరం ఇద్దరు ప్రియులు ఆమెకు ఫోన్ చేసి చంపాలా? వద్దా? అని అడిగారు. భర్తను చంపితే మనం ప్రశాంతంగా ఉంటామని పేర్కొంది. దీంతో ఉదయ్‌ను గోదావరి నదిలో ముంచి చంపారు. అనంతర గంగాధర్ వెంటనే దుబాయ్ వెళ్లిపోయాడు. మృతదేహం నాలుగు రోజుల తరువాత బయటపడడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. దౌలాజీ అంకాపూర్ చేరుకొని లావణ్యతో సహజీవనం చేశాడు. ఉదయ్ తల్లిదండ్రులు తన కుమారుడు కనపడటం లేదని తన కొడలిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి లావణ్య, ఆమె ప్రియుడు దౌలాజీని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజాలు బయటపడ్డాయి.

 

Wife Killed his Husbands with Lovers in Nizamabad