Home తాజా వార్తలు భర్తను చంపి.. ప్రియుడితో పారిపోయిన భార్య

భర్తను చంపి.. ప్రియుడితో పారిపోయిన భార్య

Lovers-Suicide

ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రం తరన్‌తరన్ జిల్లాలో భార్య తన భర్తను చంపి ప్రియుడితో పారిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజత్ ప్రిత్- సిమ్రాన్ అనే దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. సిమ్రాన్ ఈ మధ్య ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో సదరు మహిళ ప్రతి రోజూ భర్తతో గొడవలు పెట్టుకునేది. దీంతో భర్తను అంతమొందించాలని భార్య ప్లాన్ వేసింది. భర్తకు విషమున్న ఆహారం ఇచ్చింది ఇంకా అతను చనిపోకపోవడంతో మెడకు తాడి బిగించి హత్య చేసింది. ఇద్దరు పిల్లలను తండ్రి వద్దే వదిలి పెట్టి ప్రియుడితో సిమ్రాన్ లేచిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 
Wife Killed Husband after Escaped with Lover