Home తాజా వార్తలు నల్లగొండలో ప్రియుడితో కలిసి భర్తను చంపి

నల్లగొండలో ప్రియుడితో కలిసి భర్తను చంపి

Wife killed husband with lover

హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర నగర్‌లో జరిగింది. దీంతో ప్రియుడ్ని, భార్య మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీ తండాలో గణేశ్ (28), పార్వతి(25) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. పార్వతి అదే గ్రామానికి చెందిన మంగత్‌తో వివాహేతరం సంబంధం పెట్టుకోవడంతో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. మంగత్ కుటుంబంతో గణేశ్ పలుమార్లు గొడవలకు దిగాడు. గ్రామంలో ఉంటే పరువు పోతుందనుకున్న గణేశ్ తన కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో పార్వతి తన ప్రియుడిని కలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది.

ఫోన్లో గణేశ్ హత్యకు ప్రియుడితో కలిసి పార్వతి ప్లాన్ వేసింది. మంగత్ తన స్నేహితుల సహాయంతో గణేశ్‌ను హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్ నగర్‌కు రప్పించారు. మద్యం తాగుదామని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. గణేశ్‌కు పూటుగా మద్యం తాగించిన తరువాత పలుమార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఆదివారం నుంచి తన భర్త కనపడడం లేదని ఆదిభట్ల పిఎస్‌లో పార్వతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తన ప్రియుడితో కలిసి హత్య చేశాడని చెప్పడంతో ప్రియుడితో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.