Home తాజా వార్తలు కుటుంబ కలహాలు : భార్యను హత్య చేసిన భర్త

కుటుంబ కలహాలు : భార్యను హత్య చేసిన భర్త

Wife Murder By Husband In Nizamabadనిజామాబాద్ :  రెంజ‌ల్ మండ‌ల పరిధిలోని నీలా గ్రామంలో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో దావూజీ అనే వ్యక్తి తన మొదటి భార్య మనుబాయి(45)ని కత్తితో పొడిచి హత్య చేశాడు. రెండో భార్య సహకారంతోనే దావూజీ తన మొదటి భార్య మనుబాయిని హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మనుబాయి హత్యతో నీలా గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మనుబాయి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.