Wednesday, April 24, 2024

నాగర్‌కర్నూల్ లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

- Advertisement -
- Advertisement -

Suicide

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన సంఘటనను పోలిసులు బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నాగర్‌కర్నూల్ సిఐ గాంధీనాయక్ విలేకరుల సమావేశంలో తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడూరు మండలం పర్వతాయిపల్లి గ్రామానికి చెందిన దాసరి యాదయ్య, దాసరి భాగ్యమ్మలు భార్యభర్తలు. కాగా, యాదయ్య స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన మేఘావత్ గోవింద్‌తో యాదయ్య భార్య భాగ్యమ్మ మూడేళ్ళుగా అక్రమ సంబంధాన్ని సాగిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను మందలించడంతో గత కొంతకాలంగా తల్లిగారి వద్దే ఉండేది. పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చి తిరిగి సంసారానికి తిరిగి వచ్చిన భాగ్యమ్మ భర్త హత్యకు ప్రియుడి గోవింద్‌తో కలిసి పథకం వేసింది. ఫిబ్రవరి 28న ఇంటి నుంచి నాగర్‌కర్నూల్ కు మేస్త్రీ పనికోసం వెళ్ళిన దాసరి యాదయ్య ఆ రోజు ఇంటికి రాలేదు. రెండు రోజుల పాటు అతని కోసం వెతికిన ఫలితం దక్కలేదు. తీరా మార్చి 1వ తేదిన చెర్లఇటిక్యాల తుమ్మలసూగురు మధ్యలో కెఎల్‌ఐ కాలువలో యాదయ్య ద్విచక్ర వాహనాన్ని అతని తమ్ముడు పురుషోత్తం, గ్రామస్తుల ద్వారా గుర్తించి వాహనాన్ని బయటికి తీశారు. కాలవలోనే శవాన్ని గుర్తించి అనుమాన స్పద మరణం కింద తాడూరు పోలిసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు సాగించారు.

ఇదే క్రమంలో పలుమార్లు భాగ్యమ్మను పోలిసులు విచారించగా తనకేమి తెలియన్నట్లు నటించింది. తీరా పోలిసులకు అనుమానం వచ్చిందని భావించిన ఆమె గ్రామసర్పంచ్ అయినా బాల్‌రెడ్డి వద్దకు వెళ్ళి తన భర్తను తాను, ప్రియుడు మేఘావత్ గోవింద్‌తో కలిసి హత్య చేసినట్లు చెప్పడంతో ఆమెను తాడూరు పోలిసుల వద్దకు తీసుకెళ్ళి విచారించగా హత్యను తాను, మేఘావత్ గోవింద్ చేసినట్లు ఒప్పుకున్నారు. 28వ తేదిన యాదయ్యను మద్యం తాగించి బిజినేపల్లిలో కొనుగోలు చేసిన నైలాన్ తాడుతో మెడకు బిగించారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత యాదయ్య శవంతో పాటు వాహనాన్ని కెఎల్‌ఐ కాలువలో పడేసినట్లు సిఐ గాంధీనాయక్ తెలిపారు. నిందితులను బుధవారం అరెస్టు చేశామని సిఐ తెలిపారు.

 Wife Murder his Husband in Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News