Home యాదాద్రి భువనగిరి భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష

భర్త ఇంటి ఎదుట భార్య దీక్ష

                  Wife

వలిగొండః  ప్రేమించి పెళ్ళి చేసుకొని మూడు నెలలు కాపురం చేసిభార్యను వదిలేసి 5 సంవత్సరాల నుండి కనపకుండా తప్పించుకు తిరుగుతున్న భర్త ఆచూకి చెప్పాలని డిమాండ్ చేస్తూ అత్తగారి ఇంటి ముందు కోడలు దీక్ష చేస్తున్న వైనం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని నాతాళ్ళగూడెం గ్రామంలో ప్రేమజంట పల్సంలింగస్వామి,కోరబోయిన జ్యోతి కొంతకాలం ప్రేమించుకొని 5 సంవత్సరాల క్రితం నల్లగొండలోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుని హైదారాబాద్‌లోని రామాంతపూర్‌లో కాపురం పెట్టారు.

మూడు నెలల కాపురంలో కలహాలు రావడంతో భర్త లింగస్వామి భార్యకు తెలువకుండా ఇంటినుండి ఉడాయించాడు.అనంతరం జ్యోతి పుట్టిం టికి చేరి భర్త ఆచూకి కోసం ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకపోయిందని తెలిపారు.అత్త మామలను ఎన్ని సార్లు అడిగిన కులం పేరుతో దూశించేవారని ఇంట్లోకు రాకుండా అడ్డుకునే వారని జ్యోతి విలేకర్లకు తెలిపింది.శనివారం గత్యంతరం లేక అత్తవారి ఇంటి ముందు న్యాయం కోసం ధీక్ష చేస్తూంటే అత్త మామలు కొట్టి ఇంటినుండి గెంటేసి ఇంటికి తాళం చేసుకొని వెళ్ళారని తెలిపింది.న్యాయం కోసం తాను ధీక్ష చేస్తున్నట్లు,భర్త ఆచూకిని వెంటనే తెలిపి తనను కోడలిగా అంగీకరించి ఇంట్లోకి రానివ్వాలని అంతవరకు దీక్షను విరమించేది లేదని తెలిపింది