Home మంచిర్యాల అరణ్య రోదనగా..! వన్య ప్రాణుల సంరక్షణ

అరణ్య రోదనగా..! వన్య ప్రాణుల సంరక్షణ

Wildlife hunt is bumped the officers under supervision

మన తెలంగాణ /మంచిర్యాల:  వన్యప్రాణుల సంరక్షణ అ రణ్య రోధనగా మిగులుతోంది. అధికారుల పర్యవేక్షణలో పించడంతో వన్యప్రాణుల వేట జోరుగా సాగుతుంది. దీనికి తోడు వా హనాల వేగం వల్ల రోడ్డు దా టుతున్న వన్య ప్రాణులు వాహనాలకు తాకి దుర్మరణం చెందుతున్నాయి. జి ల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై అధికారుల ని ఘా తప్పింది. అభయారణ్యం లో ఉంటున్న జంతువులకు రక్షణ లేకుండా పో యింది. ఇటీవల వేటగాళ్ల ఉ చ్చుకు గాయపడిన పులి కోసం ప్రత్యేక ట్రాకర్లను పి లిపించి గాలిస్తుండగా ఇ ప్పటి వరకు జాడ తెలియరాలేదు. దీనికి తోడు తాజాగా ఆదివారం తెల్లవారు జామున న స్పూర్ మండలంలోని ఆర్కే5 గ ని వద్ద రోడ్డు దాటుతుండగా గు ర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక అక్కడి కక్కడే మృ తి చెందింది. అటవీ ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు బోర్డులు పెట్టినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం వ ల్ల వాహనాలు వేగంగా వెళ్లి జం తువుల ప్రాణాలు తీస్తున్నాయి. వన్యప్రాణుల రక్షణ కోసం చర్య లు తీసుకోవాల్సిన అటవీశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదు. పట్టణాల్లో ఉంటూ విధులు నిర్వహించడం వల్ల వేటగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోటపల్లి ఏరియాలో గల కృష్ణ జింక సంరక్షణ కేంద్రంలో అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా కృష్ణ జింకలు వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఉమ్మడి జిలా ్లలో మూడు జంతు అభయారణ్యాలు ఉన్నాయి. ఏకం గా 1,05,806 చదరపు కిలోమీటర్ల పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మంచిర్యాల జిల్లాలో కృష్ణ జింకల అభయారణ్యం,మొసళ్ల అభయారణ్యంతో పాటు జన్నారం ఏరియాలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇటీవల రెండు అభయారణ్యాల్లో వేటగాళ్లు సంచరించినట్లుగా సిసి కెమెరాల పుటేజీల్లో కనిపించాయి. ప్రాణహిత సరిహద్దులను వెంచపల్లి అటవీప్రాంతంలో గతంలో 30 నుంచి 50 వరకు కృష్ణజింకలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గినట్లు సమాచారం. అటవీ అధికారులు వారికి కేటాయించిన హెడ్‌క్వార్టర్లలో ఉండకుండా పట్టణ ప్రాంతాల నుంచి విధులకు హజరు కావడం వల్ల వన్యప్రాణుల సంరక్షణ పై నిఘా పెట్టడం లేదు. దీంతో వేటగాళ్లు అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమర్చి అటవీ జంతువులను హతమార్చి యదేచ్చగా మాంసాన్ని అమ్మకాలు జరుపుతున్నారు. నీరు, ఆహారం లభించక జంతువులు బయటకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి.

శివ్వారంలో తగ్గుతున్న మొసళ్లు …..
జైపూర్ మండలంలోని శివ్వారం మొసళ్ల అభయారణ్యంలో దినదినానికి మొసళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. 30 నుంచి 35 వరకు మొసళ్లు ఉంటాయని అధికారులు భావిస్తుండగా ఇటీవలి కాలంలో మొసళ్ల గణన చేయలేదు. వీటి రక్షణపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులు పర్యటించిన సమయంలోనే ఎల్ -మడుగులో అప్పుడు అప్పుడు బోటింగ్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారే తప్ప సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటాం….
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం తెలిపారు. వన్య ప్రాణుల అభయారణ్యాల చుట్టూ రక్షణ కోసం ట్రెంచ్ ఏర్పాటు చేస్తున్నామని,జంతువులకు అవసరమైన ఆహారం, అవి తినే మొక్కలను పెంచుతున్నామన్నారు. అంతే కాకుండా ఇటీవల వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న పులి జాడ కోసం ప్రత్యేక ట్రాకర్లను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు తీసుకొనసాగిస్తున్నామన్నారు. అటవీ ప్రాంతంలో వేటగాళ్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.