Saturday, April 20, 2024

రాహుల్‌కు జైలు శిక్షపై అప్పీలుకు వెళతాం: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ పైకోర్టులో అప్పీలుకు వెళతారని కాంగ్రెస్ పార్టీ గురువారం తెలిపింది. సత్యం మాట్లాడినందుకే రాహుల్‌ను శిక్షించారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది అంటూ రాహుల్ గాంధీ 2019లో చేసిన వ్యాఖ్యలపై పర్మేష్ మోడీ అనే బిజెపి కారకర్త దాఖలు చేసిన ఫిర్యాదుపై సూరత్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు బెయిల్ కూడా మంజూరు చేయడంతోపాటు పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా తీర్పు అమలును 30 రోజులపాటు నిలిపివేసింది. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతోసహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామదాన భేద దండోపాయాల ద్వారా రాహుల్ గాంధీ గొంతును నొక్కేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

నా సోదరుడు ఎన్నడూ భయపడలేదు..ఇక ముందు భయపడడం కూడా..నిజాలు మాట్లాడుతూనే జీవిస్తాడు..ఇక ముందు కూడా నిజాలే మాట్లాడతాడు. దేశ ప్రజల తరఫున తన గొంతు విప్పుతూనే ఉంటాడు అని ప్రయాంక పేర్కొన్నారు. రాహుల్‌కు కోర్టు విధించిన జైలు శిక్షపై అప్పీలు దాఖలు చేస్తామని ఖర్గే తెలిపారు. బిజెపి మా వైపు ఒక వేలును చూపిస్తే దానివైపు నాలుగు వేళ్లు చూపిస్తాయని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News