Home జాతీయ వార్తలు మోడీ, యోగిలకు వ్యతిరేకంగా మాట్లాడితే సజీవ సమాధి చేస్తా

మోడీ, యోగిలకు వ్యతిరేకంగా మాట్లాడితే సజీవ సమాధి చేస్తా

Raghuraj Singh

 

రఘురాజ్ సింగ్ తీవ్ర హెచ్చరిక
చితకబాదుతానని బెదిరింపు
సింగ్ వ్యాఖ్యలతో సంబంధం లేదన్న బిజెపి

అలీగఢ్ : బిజెపి నాయకుడు రఘురాజ్ సింగ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలిచ్చేవారిని సజీవ సమాధి చేస్తామని రఘురాజ్ హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టంపై (సిఎఎ) ప్రజలకు అవగాహన గలిగించేందుకు ఆదివారం అలీగఢ్‌లో జరిగిన ఒక ర్యాలీలో సింగ్ ఇలా బెదిరించారు. ‘ప్రధాని మోడీ, యుపి సిఎం ఆదిత్యనాథ్ మురదాబాద్ అంటూ నినాదాలిచ్చే వీరు అతి తక్కువగా…ఒక్క శాతం మాత్రమే ఉన్న నేరస్థులు, అవినీతిపరులు అని పేర్కొంటూ ‘వాళ్లను సజీవ సమాధి చేస్తా’ అని హెచ్చరించారు. ‘నినాదాలు చేసేవారిలా యోగి, మోడీ కంగారు పడేవాళ్లు, చికాకు పరిచేవాళ్లు కారు. వాళ్లు దేశాన్ని నడిపిస్తారు. ఇలాగే నడిపిస్తారు.

దావూద్ ఇబ్రహీం నుంచి డబ్బు తీసుకునేవాళ్లు, మన అధికారుల్ని, ముస్లింలను ఇబ్బంది పెట్టేవాళ్లను చితకబాదుతాం’ అని తీవ్ర స్వరంతో అన్నారు. అలీగఢ్‌కు చెందిన రఘురాజ్‌సింగ్ అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో ఇటీవల సిఎఎకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళనల్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.రఘురాజ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపి తనకు తానుగా దూరాన్ని పాటించింది. ‘రఘురాజ్ సింగ్ మంత్రికాని, ఎంఎల్‌ఎ కానీ కాదు’ పార్టీ ప్రతినిధి చంద్రమోహన్ ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్టు చెప్పారు. లేబర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఛైర్మన్ సునీల్ భరాలా మాట్లాడుతూ సింగ్ కార్మిక శాఖలో ఒక విభాగానికి సలహాదారు మాత్రమేనన్నారు.

Will bury alive those raising anti-Modi slogans