మధుర : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను ఏపార్టీకి చెందని వ్యక్తినైనా, జాతీయ వాదుల తరఫున ఎన్నికల్లో ప్రచారం సాగిస్తానని చెప్పారు. మధురలోని శ్రీక్రిష్ణ జన్మస్థానాన్ని శనివారం సందర్శించిన తరువాత విలేఖరులతో మాట్లాడారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేస్తారా ? అని అడగ్గా పై విధంగా సమాధానం ఇచ్చారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అసలైన జన్మస్థానాన్ని సందర్శించే అవకాశాన్ని ప్రజలకు కలగచేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఈద్గా ఉందని ఆమె వాదించారు. ఆమె వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్న విమర్శలకు ఎవరైతే నిజాయితీ పరులో, ధైర్యవంతులో జాతీయ వాదులో వారే తాను చెప్పిన వాస్తవాలను గుర్తిస్తారని కంగనా పేర్కొన్నారు. చండీగఢ్‌లో తన కారును రైతులు అడ్డుకున్నారన్న వార్తలకు స్పందిస్తూ తానెప్పుడూ క్షమాపణలు చెప్పలేదని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కంగనా చెప్పారు.
Will campaign for nationalists says kangana ranaut