Home జాతీయ వార్తలు యుపి ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకిస్తాం

యుపి ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకిస్తాం

Will oppose BJP in UP elections, says rakesh tikait

 

బికెయు నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటన

ఆగ్రా(యుపి): ఉత్తర్ ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపినిసంయుక్త కిసాన్ మోర్చ వ్యతిరేకిస్తుందని భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో పోలీసు కస్టడీలో మరణించిన అరుణ్ నర్వర్ కుటుంబాన్ని భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నాయకుడు రాకేష్ తికాయత్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అరుణ్ కుటుంబానికి రూ. 40 లక్షల పరిహారం, ఆయన కుటుంంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తికాయత్ డిమాండ్ చేశారు. అరుణ్ నర్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తికాయత్ విలేకరులతో మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయవద్దని రైతులకు పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము అభ్యర్థులను నిలపడం కాని ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం కాని చేయబోమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము సాగిస్తున్న ఆందోళన పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. ఆగ్రాలోని జగదీష్‌పురా పోలీసు స్టేషన్ నుంచి రూ. 25 లక్షలు చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ నర్వర్ అక్టోబర్ 19న పోలీసు కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే.

Will oppose BJP in uttar pradesh polls, says rakesh tikait