Home జాతీయ వార్తలు మీ హక్కులకు ఎలాంటి భంగం రాదు

మీ హక్కులకు ఎలాంటి భంగం రాదు

PM Modi

 

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పౌరసత్వ బిల్లుపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీ హక్కులను ఎవరూ హరించలేరని అంటూ ట్విట్టర్ వ్దేకగా అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. ‘పౌరసత్వ సవరణ బిల్లుపై అసోం సోదర, సోదరీమణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ హక్కులను, ప్రత్యేకమైన గుర్తింపును, అందమైన సంస్కృతిని ఎవరూ హరించలేరు. ఆ సంస్కృతి, గుర్తింపు వృద్ధి చెందుతూనే ఉంటాయి. అందుకు నాది హామీ.

అసోం ప్రజల రాజకీయ, భాషా, సాంస్కృతిక, భూ హక్కులను రాజ్యాంగపరంగా పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాం’అని ఇంగ్లీషు, అస్సామీ భాషల్లో చేసిన పలు ట్వీట్లలో ప్రధాని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో మతపరమైన పీడనకు గురై భారత్‌లో ఆశ్రయం కోరి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే దిశగా తీసుకు వచ్చిన ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసోం సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

Will protect Assam’s identity, Northeast will flourish