Home తాజా వార్తలు మద్యం షాపులపై ఆంక్షలు ఎత్తివేత

మద్యం షాపులపై ఆంక్షలు ఎత్తివేత

Wine shops to remain open till 11 pm in Telangana

 

జిహెచ్‌ఎంసి పరిధిలో రాత్రి 11గంటల వరకు, మిగతా జిల్లాల్లో 10గం.వరకు వైన్స్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్: మద్యం దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆంక్షలు ఎత్తివేసింది. ఈ మేరకు అబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఉదయం 10నుంచి రాత్రి 11గంటల వరకు, ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చునని పేర్కొన్నారు. వాస్తవానికి లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలకు అనుమతించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌లో ఇస్తున్న సడలింపులకు అనుగుణంగా రాత్రి కర్ఫూ ఎత్తివేయడంతో మద్యం షాపులపై కూడా ఆంక్షలన్నింటిని ఎత్తివేసింది.

Wine shops to remain open till 11 pm in Telangana