Home తాజా వార్తలు విప్రో లాభం 18 శాతం జంప్

విప్రో లాభం 18 శాతం జంప్

Wipro Q2 net profit rises nearly 18%

 

న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ప్రముఖ ఐటి సంస్థ విప్రో నికర లాభం రూ.2,931 కోట్లతో 18 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.2,484 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం 30 శాతం వృద్ధిని సాధించింది. గతేడాదిలో ఆదాయం రూ.15,114 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.19,667 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంలో విప్రో లాభం రూ.3,242 కోట్లు నమోదు చేయగా, దీంతో పోలిస్తే తాజా లాభం 10 శాతం తక్కువగా ఉంది. స్థూల ఆదాయం రూ.19,761 కోట్లతో 7.6 శాతం పెరిగింది. విప్రో సిఇఒ, ఎండి థీరీ డెలపోర్టె మాట్లాడుతూ, క్యూ2 ఫలితాలను చూస్తే సంస్థ వ్యాపార ప్రణాళిక బాగా పనిచేసిందని తెలుస్తోందని అన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు విలువ 2 శాతం పెరిగి రూ.672కి చేరుకుంది.

Wipro Q2 net profit rises nearly 18%