Friday, April 26, 2024

ఆర్యన్ ఖాన్ కేసులో సంచలనాత్మక మలుపు!

- Advertisement -
- Advertisement -

Aryan Khan
న్యూఢిల్లీ: క్రూయిజ్‌నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కేసు కొత్త మలుపు తిరిగింది. నాడు అరెస్టులకు నేతృత్వం వహించిన ఎన్‌సిబి అధకారి సమీర్ వాంఖడేపై తాజాగా కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న కెపి గోసవికి అతడు బాడీగార్డు. ఎన్‌సిబికి గోసవికి మధ్య రహస్య ఒప్పందం జరిగిందని, ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు రూ. 8 కోట్లు ఇస్తానని గోసవి చెప్పడం తాను విన్నానని అతడు ఆరోపించాడు. కాగా దీనికి దీటైన జవాబునిస్తానని వాంఖడే అంటున్నారు. అంతేకాక ఎన్‌సిబి కార్యాలయంలో తనతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బలవంతంగా 10 బ్లాంక్ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని కూడా తన ఐదు పేజీల అఫిడవిట్‌లో ప్రభాకర్ పేర్కొన్నారు. ఎన్‌సిబికి చెందిన సలేకర్ అనే అతను తనతో 10 బ్లాంక్ కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని కూడా తెలిపాడు. ప్రస్తుతం ముంబయి పోలీసులు పరారీలో ఉన్న గోసవి కోసం వెతుకుతున్నారు. కాగా తన ప్రాణానికి కూడా ముప్పు ఉందని ప్రభాకర్ వివరించాడు.

ఆర్యన్ ఖాన్ అరెస్టయిన క్రూయిజ్ కేసులో తొమ్మిది మందిని ఎన్‌సిబి సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటెక్టివ్ కెపి గోసవి కూడా ఒకరు. ఇందులో భాగంగా గోసవి బాడీగార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్ సెయిల్‌ను కూడా ఎన్‌సిబి విచారించింది. ఏది ఏమైనప్పటికీ క్రూయిజ్‌నౌకపై దాడి జరిగిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్‌సిబి తెల్ల కాగితాలపై సాక్షులతో సంతకాలు పెట్టించుకుందని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News