Home జాతీయ వార్తలు కరోనాపై నెట్టింట్లో తప్పుడు ప్రచారం.. సింగర్ అరెస్ట్

కరోనాపై నెట్టింట్లో తప్పుడు ప్రచారం.. సింగర్ అరెస్ట్

Arrested

కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌లో 29 ఏళ్ల ప్రముఖ సింగర్ ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్ కతా బెలిఘటలోని ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకిందంటూ సదురు మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ వైద్యులకుగాని, సిబ్బందికి గాని ఎవరికీ కరోనా సోకలేదని అధికారికంగా ప్రకటించింది. ఆ సింగర్ పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. కరోనా పై సామాజిక మాద్యమాల్లో పుకార్లను నమ్మొద్దని చెప్పాల్సిన సింగర్ ఇలా తప్పుడు ప్రచారం చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతా పోలీసు సైబర్‌క్రైమ్ శాఖకు రాష్ట్ర ఆరోగ్య శాఖ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సింగర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 505 (1) (బి) /2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 200 లోని సెక్షన్ 66 కింద ఆమెపై కేసు నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

Woman Arrested for Spreading Coronavirus Rumours