Home తాజా వార్తలు భార్య హత్య… భర్తపై అనుమానం

భార్య హత్య… భర్తపై అనుమానం

Woman brutally murdered in mancherial

 

మంచిర్యాల : మహిళ దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… ఇంటో రక్తపు మడుగులో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, బండరాయితో కొట్టి చంపినట్టుగా గుర్తించారు. మృతురాలి భర్త కనిపించకపోవడంతో అతడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతురాలి భర్త కోసం గాలింపు చర్యలు చెప్పటిన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Woman brutally murdered in mancherial