Wednesday, April 24, 2024

ఉప్పల్ పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

woman brutally murdered in uppal chilkanagar

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్ లో మహిళ హత్యకు గురైంది. మహిళను హత్యచేసిన నిందితుడు పోలీసులకు ముందు లొంగిపోయాడు. నిందితుడిని అంజయ్యగా గుర్తించారు. అతను డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అంజయ్య, మృతురాలు రేణుకల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి చిలకానగర్‌లోని అంజయ్య నివాసానికి రేణుక వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అంజయ్య ఈ హత్య జరిగింది. రేణుక తలపై బలమైన గాయాలున్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

woman brutally murdered in uppal chilkanagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News