Friday, July 19, 2024

 పంజాగుట్ట పిఎస్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముదు ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే బాధితురాలి శరీరం 60 శాతం కాలిపోవడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రవీణ్ అనే వ్యక్తి మోసం చేయడంతో లోకేశ్వరి(40) అనే మహిళ పంజాగుట్ట పిఎస్ ముందు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా పంజాగుట్టలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. లోకేశ్వరి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Woman Burnt alive before at Punjagutta PS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News